close

తాజా వార్తలు

డబ్బు ఎక్కువైతే పోరాడేశక్తి తగ్గుతుంది:పవన్‌

మదనపల్లె: తనకు డబ్బే ప్రధానమైతే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. మంగళగిరి సభతోనే తెదేపా, భాజపాతో విభేదించానని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో అనంతపురం, హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పవన్‌ మాట్లాడారు. తెదేపా, భాజపాతో విభేదించినా వైకాపా నేతలు తనపై ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. డబ్బే సంపాదించాలనుకుంటే ‘జానీ’ సినిమాకే తన రెమ్యునరేషన్‌ రూ.2 కోట్లు అని.. అప్పుడే మాదాపూర్‌లో 30 ఎకరాలు కొనుగోలు చేసుంటే ఈ పాటికి తాను రూ.వేలకోట్లకు అధిపతిని అయ్యేవాడినన్నారు. తనకు డబ్బు మీద ఎప్పుడూ ఆశలేదన్నారు. దానిపై మమకారం ఉన్న వ్యక్తిని కాదని చెప్పారు. డబ్బు ఎక్కువుంటే పోరాడే శక్తి తగ్గిపోతుందనే కూడబెట్టలేదన్నారు. వ్యాపారాలు లేని రాజకీయ నేతలు మాత్రమే ఆదర్శనీయులు అవుతారని చెప్పారు. వైకాపా నేతల చీకటి వ్యవహారాలు తనకు తెలుసని, ఆ పార్టీ బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.

‘‘జనసేనను బెదిరించే ప్రతి వైకాపా నాయకుడికీ చెబుతున్నా.. నాకు బిడ్డల మీద మమకారం లేదు.. జీవితం మీద ఇష్టం లేదు. సమాజం కోసం ఎక్కడికైనా వస్తా. సనాతన సంప్రదాయాలపై చచ్చేంత మమకారం ఉంది. నేను రోడ్డుపైకి వస్తే మీ ఆర్మీలు ఎందుకూ పనికిరావు. ఆర్‌ఎస్‌ఎస్‌లాంటి సంస్థలో దేశం కోసం కుటుంబాలను వదిలేసిన వ్యక్తులున్నారు. పెళ్లి కూడా చేసుకోకుండా దేశం కోసం తపించే వారూ ఉన్నారు. వాళ్లతో మనం పోటీపడలేం. ఏ ఫ్యాక్షన్‌ నాయకుడికీ భయపడని యువత మనకి కావాలి’’ అని పవన్‌ అన్నారు.   

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.