Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 6176
            [news_title_telugu_html] => 

అతడే పాక్‌ సచిన్‌: వీరూ

[news_title_telugu] => అతడే పాక్‌ సచిన్‌: వీరూ [news_title_english] => Sehwag point out pak sachin [news_short_description] => పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి సెహ్వాగ్‌ మాట్లాడాడు. ‘ప్రతి భారతీయుడు, పాకిస్థానీ దాయాదుల ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలనుకుంటున్నారు. [news_tags_keywords] => sehwag,sports,pak,sachin [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => || [news_videoinfo] => [publish_comments_public] => [publish_createdon] => 2018-10-09 16:49:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అతడే పాక్‌ సచిన్‌: వీరూ - Sehwag point out pak sachin - EENADU
close

తాజా వార్తలు

అతడే పాక్‌ సచిన్‌: వీరూ

ముంబయి: పాకిస్థాన్‌ జట్టులో సచిన్‌ తెందుల్కర్‌ ఎవరో టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ గుర్తించాడు. బూమ్‌ బూమ్‌ అఫ్రిది పాక్‌ జట్టులో సచిన్‌ లాంటి వాడని పేర్కొన్నాడు. ‘పాకిస్థాన్‌తో నా తొలి సిరీస్‌కు ముందు మా జట్టులోని అందరూ అఫ్రిది గురించే మాట్లాడారు. ఒక ఆటగాడిగా అతడు పాక్‌ జట్టులో సచిన్‌ లాంటివాడు. మేమందరం అతడి గురించే చర్చించేవాళ్లం’ అని గల్ఫ్‌ న్యూస్‌కు ఇచ్చిన ముఖాముఖిలో వీరూ పేర్కొన్నాడు.

అతడే పాక్‌ సచిన్‌: వీరూ

పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి సెహ్వాగ్‌ మాట్లాడాడు. ‘ప్రతి భారతీయుడు, పాకిస్థానీ దాయాదుల ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలనుకుంటున్నారు. క్రికెటర్లుగా మేమూ ఆ హోరాహోరీ పోరాటాలను వీక్షించాలని కోరుకుంటున్నాం. రెండు దేశాల ప్రభుత్వాలు చర్చించి క్రికెట్‌ సంబంధాలు పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నా. ముల్తాన్‌లో త్రిశతకం, లాహోర్‌లో ద్విశతకం, కోచి వన్డేలో శతకం లాంటి మధురస్మృతులెన్నో పాక్‌పై నాకున్నాయి’ అని సెహ్వాగ్‌ తెలిపాడు.

వీరూ, సచిన్‌ భారత్‌ తరఫున 93 వన్డేల్లో ఓపెనింగ్‌ చేసి 42.13 సగటుతో 3,919 పరుగులు సాధించారు. ఈ ద్వయం 100 పరుగుల భాగస్వామ్యాలు 12, యాభై పరుగుల భాగస్వామ్యాలు 18 నెలకొల్పొంది. ఇక గంగూలీ, సచిన్‌ 136 వన్డేల్లో ఓపెనింగ్‌కు దిగి 49.32 సగటుతో 6,609 పరుగుల సాధించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ 100 పరుగుల భాగస్వామ్యాలు 21, 50 పరుగుల భాగస్వామ్యాలు 23 నెలకొల్పారు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.