Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 41894
            [news_title_telugu_html] => 

దేశవాళీ, పుజారా, మయాంక్‌పై కుంబ్లే ప్రశంసలు

[news_title_telugu] => దేశవాళీ, పుజారా, మయాంక్‌పై కుంబ్లే ప్రశంసలు [news_title_english] => Anil Kumble praise about Indias domestic circuit and Mayank Agarwal and Cheteshwar Pujara [news_short_description] => ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో సిరీస్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు ఆటగాళ్లు అపూర్వ ఘనతకు అర్హులేనని మాజీ సారథి అనిల్‌ కుంబ్లే అన్నాడు. [news_tags_keywords] => Anil Kumble, Mayank Agarwal, Cheteshwar Pujara, Ranji, Virat kohli, INDvsAUS [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-01-09 00:23:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దేశవాళీ, పుజారా, మయాంక్‌పై కుంబ్లే ప్రశంసలు - Anil Kumble praise about Indias domestic circuit and Mayank Agarwal and Cheteshwar Pujara - EENADU
close

తాజా వార్తలు

దేశవాళీ, పుజారా, మయాంక్‌పై కుంబ్లే ప్రశంసలు

దేశవాళీ, పుజారా, మయాంక్‌పై కుంబ్లే ప్రశంసలు

ముంబయి: ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో సిరీస్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు ఆటగాళ్లు అపూర్వ ఘనతకు అర్హులేనని మాజీ సారథి అనిల్‌ కుంబ్లే అన్నాడు. కోహ్లీసేనను ప్రశంసించాడు. ‘ఇలాంటి ఘనతను ఇంతకు ముందు సాధించలేదు. 2003/04, 2007/08లో ఆస్ట్రేలియాలో సిరీస్‌ విజయానికి సమీపించాం. ఒకవేళ, కానీ అనే పదాలు వినిపిస్తూనే ఉంటాయి. ఆస్ట్రేలియాను ఓడించిన ఈ జట్టు మాత్రం ఆ ఘనతకు అర్హమైందే’ అని కుంబ్లే అన్నాడు.

‘మయాంక్‌ అగర్వాల్‌ను మెచ్చుకొని తీరాల్సిందే. ఇంతకు ముందు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం లేకున్నా నేరుగా జట్టులోకి, క్రీజులోకి వెళ్లి తన ఉనికి చాటుకున్నాడు. తొలి రెండు టెస్టుల్లో భారత్‌ ఓపెనింగ్‌ సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే మెల్‌బోర్న్‌, సిడ్నీలో మయాంక్‌ చేసిన పరుగులు అమూల్యమైనవి’ అని కుంబ్లే పేర్కొన్నాడు.

భారత దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థను కుంబ్లే ప్రశంసించాడు. అద్భుతమైన క్రికెటర్లను అంతర్జాతీయ క్రికెట్‌కు అందించిందని పేర్కొన్నాడు. ‘దేశవాళీ క్రికెట్‌ వల్లే ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లు వచ్చారు. ఐపీఎల్‌లో చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ టెస్టులతో పోలిస్తే అది పూర్తిగా విభిన్నం. భారత్‌-ఏ జట్టు పర్యటనలు, రాహుల్‌ ద్రవిడ్‌తో ఎక్కువ కాలం గడపడం ప్రయోజనం కలిగించింది’ అని కుంబ్లే వెల్లడించాడు.

‘చాలా మంది ఇప్పటికీ స్ట్రైక్‌రేట్ల గురించి మాట్లాడతారని తెలుసు. పుజారా ప్రదర్శన వారిందరి నోర్లు మూయించగలదని ఆశిస్తున్నా. ఎందుకంటే స్ట్రైక్‌రేట్‌ ముఖ్యం కాదు. జట్టు కోసం పరుగులు చేయడమే కీలకం. ఆస్ట్రేలియాలో పుజారా అదే చేశాడు’ అని కుంబ్లే ప్రశంసించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.