Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 42330
            [news_title_telugu_html] => 

దారులు మూసేసిన పంత్‌! 

[news_title_telugu] => దారులు మూసేసిన పంత్‌!  [news_title_english] => Rishabh Pant almost ended Wriddhiman Sahas chance of making a comeback says kumble [news_short_description] => టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలకగానే వృద్ధిమాన్ సాహా జట్టుకు ఎంపికయ్యాడు.... [news_tags_keywords] => Wriddhiman Saha, anil kumble, Rishabh pant, comeback [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-01-10 00:13:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దారులు మూసేసిన పంత్‌!  - Rishabh Pant almost ended Wriddhiman Sahas chance of making a comeback says kumble - EENADU
close

తాజా వార్తలు

దారులు మూసేసిన పంత్‌! 

దారులు మూసేసిన పంత్‌! 

ముంబయి: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ టెస్టులకు వీడ్కోలు పలకగానే వృద్ధిమాన్ సాహా జట్టుకు ఎంపికయ్యాడు. చక్కని కీపింగ్‌, బ్యాటింగ్‌తో అలరించాడు. అడపా దడపా అర్ధశతకాలు సాధించాడు. కొన్ని కీలక సమయాల్లో అండగా ఉన్నాడు. అతడు గాయపడటంతో యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ జట్టులోకి వచ్చాడు. దినేశ్‌ కార్తీక్‌, పార్థివ్‌ పటేల్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు.

అందివచ్చిన అవకాశాన్ని పంత్‌ రెండు చేతులా ఒడిసిపట్టాడు. ఇంగ్లాండ్‌లో శతకం బాదేశాడు. వెస్టిండీస్‌పై రెండు సార్లు 92 స్కోర్ల వద్ద ఔటయ్యాడు. తాజాగా ఆస్ట్రేలియాలో చక్కగా రాణించాడు. సిడ్నీ టెస్టులో ఏకంగా 150 పైచిలుకు పరుగులతో అజేయంగా నిలిచాడు. శస్త్రచికిత్స తర్వాత సాహా కోలుకుంటే అతడి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు అతడి తలుపులు మూసుకుపోయినట్టే అని మాజీ సారథి అనిల్‌ కుంబ్లే అభిప్రాయపడుతున్నాడు.

‘సాహాది దురదృష్టం. భారత్‌ విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో గాయపడ్డాడు. అలాంటప్పుడు గాయపడడం మంచిదికాదు. అతడు ఒక్క ఫార్మాటే ఆడతాడు. మంచి కీపర్‌. ప్రపంచంలోనే అత్యుత్తమం. బ్యాటింగ్‌లోనూ రాణించాడు. అయితే పంత్‌ తన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. కీపింగ్‌తోనే కాదు పరుగుల వరద పారించాడు. అతడి కీపింగ్‌ ఇంకా మెరుగుపడాలన్నది నిజమే. అతనింకా యువకుడు. మెరుగయ్యేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. అతడి బ్యాటింగ్‌ మాత్రం చాలా బాగుంది. సాహా తిరిగి జట్టులోకి రావడం చాలా కష్టం. జట్టులో అతడు భాగమైనా పంత్‌ ముందుంటాడు’ అని కుంబ్లే విశ్లేషించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.