Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 52032
            [news_title_telugu_html] => 

మీ విజయం ఆనందం.. అనిర్వచనీయం

[news_title_telugu] => మీ విజయం ఆనందం.. అనిర్వచనీయం [news_title_english] => Twitter Rejoices After team Indias Series Triumph [news_short_description] => నాలుగో వన్డేలో ఘోర పరాజయం తర్వాత ఆఖరి మ్యాచ్‌లో విజయ దుందుభి మోగించిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు... [news_tags_keywords] => INDvsNZ, cricket, virat kohli, sehwag, vvslaxman [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-02-04 00:46:38 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మీ విజయం ఆనందం.. అనిర్వచనీయం - Twitter Rejoices After team Indias Series Triumph - EENADU
close

తాజా వార్తలు

మీ విజయం ఆనందం.. అనిర్వచనీయం

ట్విటర్‌లో టీమిండియాపై ప్రశంసల జల్లు

వెల్లింగ్టన్‌: నాలుగో వన్డేలో ఘోర పరాజయం తర్వాత ఆఖరి మ్యాచ్‌లో విజయ దుందుభి మోగించిన టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, అభిమానలు ట్విటర్‌ వేదికగా జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు. చివరి వన్డేలో భారత్‌ 18/4తో వెనకబడింది. అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌, హార్దిక్‌ పాండ్య, కేదార్‌ జాదవ్‌ రాణించడంతో 252 పరుగులు చేసింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఛేదనలో న్యూజిలాండ్‌ 217 పరుగులకు కుప్పకూలింది. 4-1తో సిరీస్‌ గెలిచిన టీమిండియాకు విరాట్‌ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్ లక్ష్మణ్‌, హేమంగ్‌ బదానీ సహా ఎంతో మంది శుభాకాంక్షలు తెలిపారు.

* కఠిన పరిస్థితుల్లో అద్భుతంగా పుంజుకొని సిరీస్‌ను 4-1తో ముగించారు. మీ సత్తా చూపించారు. కుర్రాళ్లకు అభినందనలు. జై హింద్‌ - విరాట్‌ కోహ్లీ

* 18/4 నుంచి తేరుకొని మ్యాచ్‌ గెలవడం అసమానం. మిడిలార్డర్‌, లోయరార్డర్‌ బాగా ఆడింది. బౌలర్లను ఉపయోగించిన తీరు చూసి రోహిత్‌ను అభినందించాలి. అభినందనలు - వీరేంద్ర సెహ్వాగ్‌

* భారత్‌ అత్యద్భుత విజయం. ఇది జట్టులో చాలా సంతోషం నింపుతుంది. సిరీస్‌ ముందే గెలిచినప్పటికీ బౌలర్లు చూపిన తీవ్రతను నేనెంతో ఆస్వాదించా. మిడిలార్డర్‌, లోయరార్డర్‌ బాగా రాణించింది - వీవీఎస్‌ లక్ష్మణ్‌

* ఈ విజయం చూసి భారత్‌ చాలా ఆనందిస్తుంది. ఐదో బౌలర్లుగా శంకర్‌, కేదార్‌ 11 ఓవర్లు వేసి 53 పరుగులే ఇచ్చారు. మ్యాచ్‌లో ఇదెంతో కీలకం. 4-1తో సిరీస్‌ గెలవడం చాలా గొప్ప - మహ్మద్‌ కైఫ్‌

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.