close

తాజా వార్తలు

ప్రపంచకప్‌ ముందు రహానె కష్టాలు!

నాగ్‌పుర్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్న టీమిండియా క్రికెటర్‌ అజింక్య మరోసారి విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీ విజేత విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు కేవలం 13 పరుగులే చేశాడు. ఇరానీ కప్‌లో రెస్టాఫ్ ఇండియాకు అతడు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎడమచేతి వాటం స్పిన్నర్‌ ఆదిత్య సర్వతె (3/99) వేసిన స్లో బంతులకు జింక్స్‌ చాలా ఇబ్బంది పడ్డాడు. టీమిండియా ప్రపంచకప్‌ జట్టు పోటీలో రహానె ఉన్నాడని చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పిన మరుసటి రోజే అతడికి అదృష్టం కలిసిరాకపోవడం గమనార్హం.

రెస్టాఫ్‌ ఇండియా తరఫున తెలుగు కుర్రాడు హనుమ విహారి, కర్ణాటక ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ అదరగొట్టారు. విహారి (114; 211 బంతుల్లో 11×4, 2×6) అద్భుత శతకం బాదగా మయాంక్‌ (95) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. వీరిద్దరూ బాగా ఆడటంతో ఒకానొక దశలో 231/3తో పటిష్ఠంగా ఉన్న రెస్టాఫ్‌ ఇండియా మిడిలార్డర్‌ కుప్పకూలడంతో 330 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లు ఆదిత్య సర్వతె, అక్షయ్‌ వఖారె (3/67) రాణించారు. విహారి గత ఇరానీ కప్‌లోనూ శతకం బాదేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.