Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 57946
            [news_title_telugu_html] => 

అమరవీరుల కుటుంబాలకు షమి ఆర్థికసాయం

[news_title_telugu] => అమరవీరుల కుటుంబాలకు షమి ఆర్థికసాయం [news_title_english] => pacer shami contributes to pulwama martyrs [news_short_description] => పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులైన వారి కుటుంబాలకు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి సోమవారం ఆర్థికసాయం అందించారు. ఇప్పటికే సినీ, క్రీడా ప్రముఖులతోపాటు ఎంతో మంది సైనిక కుటుంబాలకు... [news_tags_keywords] => PulwamaAttack,MDShami,Sehwag [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-02-18 22:49:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అమరవీరుల కుటుంబాలకు షమి ఆర్థికసాయం - pacer shami contributes to pulwama martyrs - EENADU
close

తాజా వార్తలు

అమరవీరుల కుటుంబాలకు షమి ఆర్థికసాయం

ఇంటర్నెట్ డెస్క్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులైన వారి కుటుంబాలకు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి సోమవారం ఆర్థికసాయం అందించారు. ఇప్పటికే సినీ, క్రీడా ప్రముఖులతోపాటు ఎంతో మంది సైనిక కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు ముందుకు వచ్చారు.  గురువారం జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షమీ మాట్లాడుతూ.. ‘భద్రతా దళాలు దేశం కోసం సరిహద్దుల్లో నిలబడతారు. మేము దేశం కోసం ఆడితే వాళ్లు మన కోసం దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తారు. ఇలాంటి సందర్భంలో మన జవాన్ల కుటుంబాలకు మనమంతా అండగా ఉందాం. వారి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉందాం అని షమీ పేర్కొన్నారు. అంతకుముందే టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ ట్విటర్‌ వేదికగా సైనిక కుటుంబాలకు అండగా ఉంటానని తెలిపారు. తానూ ఆర్థికసాయం చేస్తానని శిఖర్‌ ముందుకు వచ్చారు. అలాగే ఓ భావోద్వేగ వీడియో పోస్టు చేస్తూ అతని అభిమానులను కూడా సాయమందించాల్సిందిగా కోరాడు. వీరితో పాటు వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతంగంభీర్‌ కూడా అమర సైనికుల పిల్లలకు తమ వంతుగా విద్యనందించటానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, సచిన్‌‌, హార్థిక్‌పాండ్యా, రోహిత్‌శర్మ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సురేశ్‌రైనా, మహ్మద్‌ కైఫ్‌ ట్విటర్‌ వేదికగా జవాన్ల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. దాడి జరినప్పటి నుంచి సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు సాయమందించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు భారీ మొత్తంలో ఇవ్వడానికి సాయం చేయడానికి ముందుకు రావడం విశేషం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.