close

తాజా వార్తలు

ఆస్పత్రిలో చేరిన కేన్‌ విలియమ్సన్‌ 

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఆస్పత్రి పాలయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో విలియమ్సన్‌ ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో  అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినట్లు ఆ జట్టు అధికార ప్రతినిధి తెలిపారు. ఆదివారం బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ విలియమ్సన్‌ డైవ్‌ చేయబోయాడు. ఈ క్రమంలో ఎడమ భుజానికి గాయమైంది. బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 211 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మూడు వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ తీవ్ర నొప్పిని భరిస్తూ టెస్టుల్లో 30వ అర్థశతకం సాధించాడు. అప్పటికే రెండుసార్లు వైద్య సహాయం తీసుకున్న విలియమ్సన్‌ 74 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆపై నొప్పి తీవ్రతరం కావడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించినట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా న్యూజిలాండ్‌ బాట్స్‌మెన్‌ రాస్‌టేలర్‌ సోమవారం డబుల్‌ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అంతకుముందు 20 పరుగుల వద్ద రెండుసార్లు క్యాచ్‌ జారవిడిచిన బంగ్లాదేశ్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. దీంతో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి టేలర్‌ 185 పరుగులు చేయగా మరో బ్యాట్స్‌మెన్‌ హెన్రీ నికోల్స్‌ 93 పరుగులు సాధించాడు. మొత్తంగా న్యూజిలాండ్‌ 161 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా మొదటి రెండు రోజులు వాతావరణం అనుకూలించకపోవడంతో చివరి రోజు ఎలాగైనా బంగ్లాను ఓడించి మూడు మ్యాచుల సిరీస్‌ను నెగ్గాలని పట్టుదలతో కనిపిస్తోంది. ఇప్పటికే మొదటి టెస్టు గెలిచిన న్యూజిలాండ్‌ రెండో టెస్టుపై కన్నేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.