Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 67927
            [news_title_telugu_html] => 

భాజపా సీటును తిరస్కరించిన సెహ్వాగ్‌!

[news_title_telugu] => భాజపా సీటును తిరస్కరించిన సెహ్వాగ్‌! [news_title_english] => Sehwag denied BJP ticket in delhi for loksabha elections [news_short_description] => టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ భాజపా టికెట్‌ను తిరస్కరించారని దిల్లీకి చెందిన ఓ సీనియర్‌ భాజపా నేత వెల్లడించారు... [news_tags_keywords] => Sehwag,Cricketer,Lok Sabha Elections 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-15 13:01:16 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భాజపా సీటును తిరస్కరించిన సెహ్వాగ్‌! - Sehwag denied BJP ticket in delhi for loksabha elections - EENADU
close

తాజా వార్తలు

భాజపా సీటును తిరస్కరించిన సెహ్వాగ్‌!

దిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌  సెహ్వాగ్‌ భాజపా టికెట్‌ను తిరస్కరించారని దిల్లీకి చెందిన ఓ సీనియర్‌ భాజపా నేత వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతో సెహ్వాగ్‌ భాజపా సీటును కాదన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ దిల్లీ నుంచి భాజపా లోక్‌సభ అభ్యర్థిగా సెహ్వాగ్‌ కోసం ప్రతిపాదన వచ్చిందని.. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన ఈ అవకాశాన్ని తిరస్కరించారని చెప్పారు. ఇదిలా ఉండగా లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలోని రోహ్‌తక్‌ నుంచి వీరూ భాజపా అభ్యర్థిగా నిలబడతారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని సెహ్వాగ్‌ ట్విటర్‌లో ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి వదంతులు కొన్ని ఎప్పటికీ మారవు. 2014లోనూ ఇలాగే ప్రచారంచేశారు. ఇప్పుడు 2019 ఎన్నికల్లోనూ చేస్తున్నారు. అప్పుడూ, ఇప్పుడూ నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు’ అని వీరు స్పష్టం చేశారు.

భాజపా నేత ఇంకా మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతంగంభీర్‌ ఆసక్తిగా ఉన్నారని, ఇటీవల ఓసారి పార్టీ మీటింగ్‌కు కూడా హాజరయ్యారని చెప్పారు. ఇదే విషయంపై గంభీర్‌ను మీడియా ప్రశ్నించగా.. ఈ విషయాలపై తనకెలాంటి సమాచారం లేదని, అవన్నీ వదంతులేనని జవాబిచ్చాడు. రిటైర్మెంట్‌ తర్వాత రాజకీయాల్లోకి చేరతానని వచ్చిన వదంతుల్లో.. నిజం లేదని తేల్చి చెప్పారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.