
తాజా వార్తలు
ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు అతడితో తలనొప్పే: ఏబీడీ
ముంబయి: ప్రపంచకప్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్లకు తలనొప్పిగా మారతాడని ఏబీ డివిలియర్స్ అన్నాడు. ఏడాది కాలంగా అతడి ప్రదర్శన అసామాన్యంగా ఉందని ప్రశంసించాడు. ఇప్పట్లో ఆ జోరు తగ్గేలా కనిపించడం లేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ‘మిస్టర్ 360’ ఆయా దేశాల్లో టీ20 లీగులు ఆడుతున్నాడు. సరికొత్త ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాంలెజర్స్ తరఫున అలరించేందుకు సిద్ధమయ్యాడు.
‘మా ఇద్దరిలో కొన్ని పోలికలు ఉన్నాయి. మేమిద్దరం పోరాట యోధులమే. అపజయాన్ని ఇష్టపడం. ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తాం. ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాం. ఏదేమైనప్పటికీ ఇతర క్రికెటర్ల మాదిరిగా విరాట్ మనిషే కదా. కొన్ని సార్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. అప్పుడు మళ్లీ ప్రాథమిక అంశాలను మెరుగు చేసుకొని మైదానానికి వెళ్లాలి. అతడి మూర్తిమత్వం, మానసిక బలంతోనే కష్టాల్లో రాటుదేలి ప్రస్తుతం కోహ్లీ అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు’ అని డివిలియర్స్ అన్నాడు.
ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్ల గురించి ఏబీడీ చెప్పాడు. ‘భారత్, ఇంగ్లాండ్ చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచింది. రెండేళ్ల క్రితమే లార్డ్స్‌లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. బహుశా ఈ నాలుగు జట్లే ఫేవరెట్’ అని మిస్టర్ 360 అంచనా వేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఆరిఫ్, చెన్నకేశవుల చేతిలో తుపాకులు!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
