close

తాజా వార్తలు

ఏప్రిల్‌లో అర్జున్‌, మలైకాల వివాహం?

ముంబయి‌: అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారట. ఏప్రిల్‌ 19న చర్చిలో వీరి పెళ్లి జరగబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. మలైకా స్నేహితులు కరీనా కపూర్‌, కరిష్మా కపూర్‌.. అర్జున్‌ స్నేహితులు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె కూడా విచ్చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే పెళ్లి గురించి బయటపెట్టొద్దని ఈ ప్రేమ జంట తమ టీంకు చెప్పారట. దీంతో వివాహం గురించి రహస్యంగా ఉంచినట్లు సమాచారం.
అర్జున్‌, మలైకా ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అర్జున్‌ కాఫీ విత్‌ కరణ్‌ షోలో పరోక్షంగా ఒప్పుకున్నారు. తను డేటింగ్‌లో ఉన్న మహిళను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కానీ ఆ మహిళ మలైకా అని మాత్రం ఆయన వెల్లడించలేదు. తమ ప్రేమ వార్తల గురించి మలైకా ఓ సందర్భంలో స్పందిస్తూ.. ‘ఇవంతా మీడియా కల్పిస్తున్న కథలు’ అని చెప్పారు. 1998లో సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌తో మలైకాకు వివాహం జరిగింది. 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. అర్జున్‌ కంటే మలైకా 12 ఏళ్లు పెద్దవారు కావడం గమనార్హం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.