close

తాజా వార్తలు

సంజూ శతకం వృథా: హైదరాబాద్‌ విజయం

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 199 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లకే ఛేదించింది. డేవిడ్‌ వార్నర్‌ (69; 37 బంతుల్లో 9×4, 2×6), బెయిర్‌ స్టో (45; 28 బంతుల్లో 6×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఛేదన సులభమైంది. విజయ్ శంకర్‌ (35; 15 బంతుల్లో 1×4, 3×6) తనదైన రీతిలో చెలరేగాడు. చివర్లో ఉత్కంఠ రేగినా యూసుఫ్‌ పఠాన్‌ (16), రషీద్‌ ఖాన్‌ (15) విజయం అందించారు. అంతకు ముందు రాయల్స్‌లో సంజు శాంసన్‌ (102), అజింక్య రహానె (70) చెలరేగారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.