close

తాజా వార్తలు

హైదరాబాద్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన

హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడి పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్‌ ద్వారా హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు భలే వినోదం లభించింది.  మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ సంజూ శాంసన్‌ విరోచిత శతకంతో 198 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా ఛేదనలో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌, బెయిర్‌స్టో బ్యాట్‌ ఝుళిపించడంతో ఒక ఓవర్‌ మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ గణాంకాలు పరిశీలిస్తే.. 

* ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ జాస్‌ బట్లర్‌ వికెట్‌ తీయడంలో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో బట్లర్‌ అత్యధికంగా మూడుసార్లు అతడి బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
* అజింక్య రహానే, సంజూ శాంసన్‌ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 119 పరుగులు చేశారు. రాజస్థాన్‌ తరఫున రెండో వికెట్‌కు ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం.
* ఐపీఎల్‌లో సంజు రెండో శతకం బాది.. భారత్‌ తరఫున ఒకటి కంటే ఎక్కువ శతకాలు నమోదు చేసిన విరాట్‌కోహ్లీ(4), వీరేందర్‌ సెహ్వాగ్‌(2), మురళీ విజయ్‌(2) సరసన చేరాడు. 
* ఐపీఎల్‌లో భువనేశ్వర్‌కు ఇదే పేలవ ప్రదర్శన. ఈ మ్యాచ్‌లో 55 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. కాగా 2016లో బెంగళూరుపై 55 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
* హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో ఇదే అత్యుత్తమ ఛేదన. రాజస్థాన్‌పై 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇదివరకు గతేడాది దిల్లీపై 188 పరుగులు ఛేదించింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.