close

తాజా వార్తలు

రెండు చేతుల్లేవు...అయినా మెరుపు వేగంతో బౌలింగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అంటే కొందరికి ఇష్టం.. మరికొందరికి తపన. కానీ క్రికెట్‌ని ఒక క్రీడగా కాకుండా సర్వస్వం అదే అని భావించే వాళ్లు ఇంకొందరు ఉంటారు. వైకల్యాన్ని సైతం జయించి అందులో నిలిచే వాళ్లు కొందరే ఉంటారు. ఈ కోవలోకి చెందినవాళ్లకు ఉదాహరణే ఈ వీడియోలోని బాలుడు. ఓ గల్లీలో కొందరు టీనేజ్‌ పిల్లలు క్రికెట్‌ ఆడుతున్న వీడియో టీమిండియా క్రికెటర్‌ వృద్ధిమాన్‌ సాహా కంట పడింది. రెండు చేతులు లేని ఓ బాలుడు కసిగా బౌలింగ్‌ చేస్తున్న వీడియోనే ఇది. ఇంకేముంది  ‘క్రికెట్‌ ఆడటం నుంచి ఇతడిని ఎవరూ ఆపలేరు’ అంటూ వెంటనే దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీంతో ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ అతడు క్రికెట్‌ ఎలా ఆడుతున్నాడో మీరు కూడా చూసేయండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.