close

తాజా వార్తలు

పంత్‌కు చక్కిలిగింతలు పెట్టిన రషీద్‌ఖాన్‌

 ఇద్దరి మధ్య సరదా వీడియో వైరల్‌

దిల్లీ: దిల్లీ క్యాపిటల్స్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌, సన్‌రైజర్స్‌ బౌలర్‌ రషీధ్‌ ఖాన్‌ మధ్య జరిగిన సరదా సన్నివేశం ప్రస్తుతం ట్విటర్‌లో వైరల్‌గా మారింది. గురువారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు పంత్‌, రషీద్‌ గ్రౌండ్‌లో సరదాగా గడిపారు. ఆ సమయంలో సన్‌రైజర్స్‌ బౌలర్‌.. దిల్లీ బ్యాట్స్‌మన్‌ను ఆటపట్టిస్తూ చక్కిలిగింతలు చేశాడు. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడారు. అక్కడే ఉన్న కొందరు వీరి సరదా సన్నివేశాన్ని వీడియో తీయడంతో దాన్ని ఐపీఎల్‌ ట్విటర్‌ పేజీలో పోస్టు చేశారు. ఈ వీడియోలో రిషభ్‌ పంత్‌, రషీద్‌ ఖాన్‌ ఏం సంభాషిస్తున్నారో ఊహించండి అంటూ పోస్టులో పేర్కొన్నారు. దీంతో అభిమానులు తమకు తోచిన సరదా సంభాషణలను పేర్కొంటూ ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు.

అభిమానుల సరదా కామెంట్లు:

*రిషభ్‌ పంత్‌: నీ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సులు కొడతా
*రషీద్‌ ఖాన్‌: మొదటి బంతికే నువ్వు క్లీన్‌బౌల్డ్‌ అయిపోతావ్‌

*పంత్‌తో రషీద్‌: మొదట రెండు సిక్సులు కొట్టు. తర్వాత నా బౌలింగ్‌లో ఔటవ్వు. అప్పుడు నువ్వు ఖుషీగా ఉంటావ్‌. నేనూ ఖుషీగా ఉంటా.

* ఇండియా ఆఫ్గనిస్థాన్‌ భాయ్‌ భాయ్‌ అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.