close

తాజా వార్తలు

‘ఇండియాస్‌ ఒసామా’ను ఎలా పట్టుకున్నారు?

ఉత్కంఠభరితంగా ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ టీజర్‌

ముంబయి: మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలంటే ప్రేక్షకులూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు ఆ జోనర్‌కు చెందిన సినిమా హిందీలో తెరకెక్కుతోంది. టైటిల్‌.. ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్’. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్ర టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. కరుడుగట్టిన ఓ ఉగ్రవాది చేసిన దారుణ ఘటనలను వివరిస్తున్న సన్నివేశాలతో టీజర్‌ మొదలైంది. ఇతనెవరో? ఎలా ఉంటాడో? ఎవ్వరికీ తెలీదు. కానీ అందరూ ‘ఇండియాస్‌ ఒసామా’ అని పిలుస్తుంటారు. ఈ నేరగాడిని పట్టుకోవడానికి ఒక్క బుల్లెట్‌ కూడా వాడకుండా మన దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏం చేశారు?అన్న నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఆ ఐదుగురు వ్యక్తుల్లో ఒకరిగా అర్జున్‌ కపూర్‌ నటించారు. సినిమాలో అర్జున్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ప్రభాత్‌ పాత్రను పోషించారు. మే 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.