Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 89510
            [news_title_telugu_html] => 

రహానెకు అరుదైన అవకాశం

[news_title_telugu] => రహానెకు అరుదైన అవకాశం [news_title_english] => Ajinkya Rahane joins Hampshire for English county stint [news_short_description] => టీమిండియా బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానె ఓ అరుదైన అవకాశం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లిష్‌ కౌంటీల్లో ఆడేందుకు హ్యాంప్‌షైర్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో హ్యాంప్‌షైర్‌కు ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా.... [news_tags_keywords] => Ajinkya Rahane,Hampshire,English County Championship [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-26 09:56:12 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రహానెకు అరుదైన అవకాశం - Ajinkya Rahane joins Hampshire for English county stint - EENADU
close

తాజా వార్తలు

రహానెకు అరుదైన అవకాశం

దిల్లీ : టీమిండియా బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానె ఓ అరుదైన అవకాశం సొంతం చేసుకున్నాడు. ఇంగ్లిష్‌ కౌంటీల్లో ఆడేందుకు హ్యాంప్‌షైర్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో హ్యాంప్‌షైర్‌కు ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ జట్టుకు ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్‌రమ్‌, శ్రీలంక ఆటగాడు దిముత్‌ కరుణరత్నే ఇద్దరూ ప్రపంచకప్‌ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే, మార్క్‌రమ్‌ స్థానంలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం రహానెను తీసుకున్నట్లు హ్యాంప్‌షైర్‌ యాజమాన్యం తెలిపింది. రహానె నాణ్యమైన ఆటగాడు. అతడిని జట్టులోకి తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రహానె టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా సేవలు అందిస్తాడు. అతని ప్రాతినిధ్యం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని హ్యాంప్‌షైర్‌ జట్టు యాజమాన్యం పేర్కొంది. కౌంటీలో ఆడేందుకు అవకాశం రావడంపై రహానె స్పందించాడు. ‘హ్యాంప్‌షైర్‌కు ఆడుతున్న మొదటి భారతీయుడిని కావడం చాలా ఆనందంగా ఉంది. కౌంటీ క్రికెట్‌కు మంచి పేరుంది. ఈ లీగ్‌లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి నా జట్టు విజయానికి కృషి చేస్తాను. కౌంటీల్లో ఆడేందుకు నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని రహానె పేర్కొన్నాడు.

రహానె ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల ఒక శతకం కూడా సాధించాడు. అయితే, ఐపీఎల్‌ ముగిసిన అనంతరం రహానె ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. ఏప్రిల్‌ 25న మొదలైన వన్డే లీగ్‌ మే 25న ముగియనుంది. భారత జట్టు తరఫున 56 టెస్టులాడిన రహానె 40.55సగటుతో 3,488 పరుగులు చేశాడు. అందులో 9 శతకాలు, 17 అర్ధశతకాలున్నాయి. 90 వన్డేల్లో 35.26 సగటుతో 2,962 పరుగులు చేయగా అందులో 3శతకాలు 24 అర్ధశతకాలు నమోదు చేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.