close

తాజా వార్తలు

చంపినా చచ్చినా వెళ్లేది స్వర్గానికే..

ఉత్కంఠభరితంగా ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ ట్రైలర్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్’. రాజ్‌కుమార్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ‘ఇది ఓ యుద్ధం.. ఈ యుద్ధంలో నేను చంపొచ్చు, చావచ్చు. కానీ చంపినా, చచ్చినా నేను వెళ్లేది స్వర్గానికే..’ అంటూ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భారత్‌లో ఎన్నో దాడులకు పాల్పడిన ‘ఇండియాస్‌ ఒసామా’ అనే ఉగ్రవాది నేపథ్యంలో తీసిన సినిమా ఇది. అతను ఎవరో? ఎలా ఉంటాడో? ఎవ్వరికీ తెలీదు. ఈ నేరగాడిని పట్టుకోవడానికి ఒక్క బుల్లెట్‌ కూడా వాడకుండా మన దేశానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏం చేశారు?అన్నదే ఈ సినిమా కథ. ఆ ఐదుగురులో ఒకరిగా అర్జున్‌ కపూర్‌ నటించారు. ఇందులో ఆయన ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ప్రభాత్‌ పాత్రను పోషించారు. మే 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.