
తాజా వార్తలు
దిల్లీ : రాజస్థాన్ రాయల్స్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ అర్ధశతకం నమోదు చేశాడు. 17 సంవత్సరాల 175 రోజుల్లోనే అర్ధశతకం చేసి ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. పరాగ్ 50(49బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేసి ఐపీఎల్లో తన హాఫ్ సెంచరీ బాదాడు. పరాగ్ రాణించడంతో రాజస్థాన్ 115 పరుగులు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో వెటరన్ ఇషాంత్‌శర్మ, అమిత్ మిశ్రా రాణించడంతో దిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. రాజస్థాన్ తరఫున 7 మ్యాచ్‌లాడిన పరాగ్ 32 సగటుతో 160 పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు కూడా తీశాడు.
ఐపీఎల్లో హాఫ్ సెంచరీలు బాదిన యువ ఆటగాళ్లు
ఆటగాడు | వయసు | సీజన్ |
రియాన్ పరాగ్ | 17 సంవత్సరాల 175 రోజులు | 2019 |
సంజూ శాంసన్ | 18 సంవత్సరాల 169 రోజులు | 2013 |
పృథ్వీషా | 18 సంవత్సరాల 169 రోజులు | 2018 |
రిషభ్ పంత్ | 18 సంవత్సరాల 212 రోజులు | 2016 |
శుభ్‌మన్ గిల్ | 18 సంవత్సరాల 237 రోజులు | 2018 |
అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్ హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాళ్లంతా ఈ మ్యాచ్‌లో ఉండటం విశేషం. దిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషభ్‌పంత్, పృథ్వీషా ఉండగా, రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్, రియాగ్ పరాగ్ ప్రాతినిధ్యం వహించారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
