close

తాజా వార్తలు

మళ్లీ 2 వికెట్లు: 13 ఓవర్లకు ముంబయి 90/4

హైదరాబాద్‌: చెన్నైతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచులో ముంబయి ఇండియన్స్‌ మరోసారి వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (15; 17 బంతుల్లో 1×4)ను ఇమ్రాన్‌ తాహిర్‌ ఔట్‌ చేశాడు. 11.2వ బంతిని ఆడబోయి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ కావడంతో యాదవ్‌ బౌల్డ్ అయ్యాడు. అతడి నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన కృనాల్‌ పాండ్య (7; 7 బంతుల్లో) శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన 12.3వ బంతికి ఔటయ్యాడు. గాల్లోకి లేచిన బంతిని ఠాకూర్‌ చాలా దూరం పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. ఇషాన్‌ కిషన్‌ (21; 21 బంతుల్లో 3×4) ఆచితూచి ఆడుతున్నాడు. కీరన్‌ పొలార్డ్‌ క్రీజులోకి వచ్చాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.