Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 99234
            [news_title_telugu_html] => 

జట్టుకు ధోనీ చెప్పిన కఠిన శిక్ష ఏంటో తెలుసా?

[news_title_telugu] => జట్టుకు ధోనీ చెప్పిన కఠిన శిక్ష ఏంటో తెలుసా? [news_title_english] => MS Dhoni Suggested Rs 10000 Fine And No Player Was Late Ever Again Reveals Paddy Upton [news_short_description] => భారత క్రికెట్‌ జట్టును విజయవంతంగా నడిపిన సారథుల్లో ఎంఎస్‌ ధోనీ ఒకరు. తను నాయకుడిగా ఎంపికైన మొదట్లో అన్నీ తానే అయి జట్టును ముందుకు నడిపించాడు. ఆదర్శవంతమైన డ్రెస్సింగ్‌ రూమ్‌ను రూపొందించాడు.... [news_tags_keywords] => ms dhoni,paddy upton,anil kumble,team india [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-17 00:43:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జట్టుకు ధోనీ చెప్పిన కఠిన శిక్ష ఏంటో తెలుసా? - MS Dhoni Suggested Rs 10000 Fine And No Player Was Late Ever Again Reveals Paddy Upton - EENADU
close

తాజా వార్తలు

జట్టుకు ధోనీ చెప్పిన కఠిన శిక్ష ఏంటో తెలుసా?

ముంబయి: భారత క్రికెట్‌ జట్టును విజయవంతంగా నడిపిన సారథుల్లో ఎంఎస్‌ ధోనీ ఒకరు. తను నాయకుడిగా ఎంపికైన మొదట్లో అన్నీ తానే అయి జట్టును ముందుకు నడిపించాడు. ఆదర్శవంతమైన డ్రెస్సింగ్‌ రూమ్‌ను రూపొందించాడు. కాగా జట్టు సమావేశాలకు ఆటగాళ్లు ఆలస్యంగా రావొద్దని మహేంద్రసింగ్‌ ధోనీ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడని అప్పటి మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌ ప్యాడీ అప్టన్‌ వెల్లడించారు. ఏ ఒక్కరు ఆలస్యంగా వచ్చినా జట్టులోని మిగతా వాళ్లంతా తలో రూ.10,000 జరిమానా కట్టాలని ఆదేశించాడట. దాంతో ఎప్పుడూ ఒక్క ఆటగాడైనా ఆలస్యంగా రాలేదని ఆయన పేర్కొన్నారు.

‘నేను జట్టులో చేరినప్పుడు అనిల్‌ కుంబ్లే టెస్టు సారథి. మహీ వన్డే నాయకుడు. మేమంతా స్వయం పరిపాలకులుగా ఉండేవాళ్లం. అందుకే జట్టు సమావేశాలకు, సాధనకు ఆటగాళ్లు సరైన సమయానికి రావాలని చెప్పాం. అందరూ సరే అన్నారు. ఎవరైనా సరే ఆలస్యంగా వస్తే ఏం చేద్దాం? అని చర్చించాం. అందరం ఆలోచించి సారథికే నిర్ణయ బాధ్యత అప్పగించాం. ఆలస్యంగా వచ్చే వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించాలని కుంబ్లే సూచించాడు. అయితే ధోనీ మాత్రం ఇంతకన్నా కఠినమైన శిక్ష సూచించాడు. ఆలస్యంగా ఎవరొచ్చినా మిగతా వాళ్లంతా తలో రూ.10,000 చెల్లించాలని నిర్ణయించాడు. దాంతో ఒక్కరోజు సైతం ఎవరూ ఆలస్యంగా కాలేదు’ అని ప్యాడీ అప్టన్‌ తెలిపారు. ప్రశాంతంగా ఉండటమే ధోనీ బలమని ఆయన పేర్కొన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.