close

తాజా వార్తలు

వైభవంగా క్రికెటర్‌ హనుమ విహారి వివాహం

వరంగల్‌ క్రీడా విభాగం: భారత యువ క్రికెటర్‌ గాదె హనుమ విహరి మూడు మూళ్ల బంధంతో ఆదివారం ఓ ఇంటి వాడయ్యాడు. హన్మకొండలో ప్రీతిరాజ్‌తో అతని వివాహం ఘనంగా జరిగింది. హంటర్‌ రోడ్డులోని కోడెం కన్వెన్షన్‌ హాలులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్, జిల్లాకు చెందిన పలు క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.  

అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆల్‌ రౌండ్‌ ప్రతిభతో ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న విహారి.. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వరంగల్‌కు చెందిన ప్రీతిరాజ్‌ను తొలిసారిగా కలుసుకున్నాడు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆదివారం జరిగిన వివాహంతో వీరు ఒక్కటయ్యారు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.