close

తాజా వార్తలు

 రహానె శతకం.. అరుదైన రికార్డు

ఆ ఘనత సాధించిన మూడో భారత క్రికెటర్‌

లండన్‌: భారత జట్టు టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లీష్‌కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే శతకం సాధించిన మూడో భారత ఆటగాడిగా ఈ ఘనత సాధించాడు. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక కాని రహానే ప్రస్తుతం ఇంగ్లీష్‌ కౌంటీలో హాంప్‌షైర్‌ జట్టుతో క్రికెట్‌ ఆడుతున్నాడు. ప్రపంచకప్‌ సందర్భంగా భారత జట్టు ఇంగ్లాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన రోజే రహానె శతకం సాధించిడం విశేషం. అంతకుముందు పీయుష్‌ చావ్లా, మురళీకార్తీక్‌ కౌంటీ క్రికెట్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే శతకాలు సాధించారు.

నాటింగ్‌హాంషైర్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులకే ఔటైన రహానె.. రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి (119) శతకం సాధించాడు. అంతకుముందు తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుని సామ్‌(133)తో కలిసి రహానె మూడో వికెట్‌కు 257 పరుగులు జతచేశాడు. వీరిద్దరూ చెలరేగడంతో హాంప్‌షైర్‌ జట్టు 367/5 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యంతో కలిపి ప్రత్యర్థి ముందు 439 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

ఇదిలా ఉండగా ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానె టోర్నీలో మొత్తం 393 పరుగులు చేశాడు. అందులో ఒక శతకం ఉండటం విశేషం. అయితే రాజస్థాన్‌ ఓటమికి కారణంగా జట్టు కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించిన యాజమాన్యం స్టీవ్‌స్మిత్‌కు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.