close

తాజా వార్తలు

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌కు గాయం: ఆస్పత్రికి తరలింపు

సౌథాంప్టన్‌: ప్రపంచకప్‌ ముందు ఇంగ్లాండ్‌ కెప్లెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ గాయంబారిన పడ్డాడు. శుక్రవారం ఉదయం ప్రాక్టీస్‌ చేస్తుండగా అతడి చేతివేలికి గాయమైందని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. మెగా టోర్నీ ఆరంభానికి ముందు శనివారం ఆస్ట్రేలియాతో ఆ జట్టు వార్మప్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం సహచర ఆటగాళ్లతో కలిసి సౌథాంప్టన్‌ మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తుండగా క్యాచులు పట్టాడు. ఈ క్రమంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైందని, ప్రాక్టీస్‌ అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లామని ఓ అధికారి తెలిపారు. 

ముందస్తు చర్యల్లో భాగంగా చేతివేలికి ఎక్స్‌రే తీయిస్తున్నామని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా మోర్గాన్‌ కెప్టెన్సీలో వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో నిలిచిన ఆ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టుగా మారింది. అయితే బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఆ జట్టులో మోర్గాన్‌ కీలక ఆటగాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ మే 30న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.