close

తాజా వార్తలు

రాయుడి ట్వీట్‌పై స్పందించిన విజయ్‌శంకర్‌

 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక విషయంలో వివాదం

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా ప్రపంచకప్‌ జట్టులో తనను ఎంపిక చేయకపోవడంతో గతంలో అంబటిరాయుడు చేసిన వివాదాస్పద ట్వీట్‌పై యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌శంకర్‌ స్పందించాడు. ఆ ట్వీట్‌ తనని ఉద్ధశించింది కాదని, ఒక క్రికెటర్‌గా అతడిని అర్థం చేసుకుంటానని అన్నాడు. ప్రముఖ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ శంకర్‌ ఇలా చెప్పుకొచ్చాడు. ‘ఒక క్రికెటర్‌ని ప్రపంచకప్‌ జట్టులో ఎంపిక చెయ్యకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఒక ఆటగాడిగా అర్థం చేసుకోగలను. ఇంకా చెప్పాలంటే రాయుడు చేసిన ట్వీట్‌ నా గురించి కాదు. ఆ ట్వీట్‌తో తన అసహనం తెలియజేశాడు. ఏ క్రికెటర్‌కైనా ఇది సహజమే’ అని పేర్కొన్నాడు. 
కాగా ఏప్రిల్‌ 15న బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ భారత జట్టులో స్థానం కల్పించకపోవడంతో రాయుడు అసహనాన్ని వ్యక్తం చేశాడు. ‘ప్రపంచకప్‌ వీక్షించేందుకు ఇప్పుడే 3డీ కళ్లద్దాలు ఆర్డర్‌ చేశాను’ అని ఎద్దేవా చేశాడు. అయితే టీమిండియా సెలెక్షన్‌ చీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఆ సందర్భంలో మాట్లాడుతూ.. ‘విజయ్‌శంకర్‌లో మూడు కోణాలు ఉన్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌ చెయ్యగల సమర్థుడు. అందుకే అతడిని నాలుగో స్థానం ఆటగాడిగా ఎంపిక చేశాం’ అని పేర్కొన్నాడు. దీంతో విజయ్‌ని ఉద్దేశిస్తూ రాయుడు ట్వీట్‌ చెయ్యడం అప్పట్లో వివాదాస్పదం అయింది. 
విజయ్‌శంకర్‌ ప్రపంచకప్‌ గురించి మాట్లాడుతూ.. అన్ని విభాగాల్లో రాణించేందుకు మంచి సాధన చేస్తా. జట్టుకు అవసరమైనప్పుడల్లా అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు సిద్ధంగా ఉంటా. గత కొన్నేళ్లుగా బాగా తిరుగుతున్నా. అందరి నుంచీ మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే ప్రపంచకప్‌లోనూ ఆదరిస్తారనుకుంటున్నా. ప్రపంచకప్‌లో ఆడటం మంచి అవకాశం. అందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను ఒక్క మ్యాచ్‌ గెలిపించినా చాలా సంతోషపడతా’ అని వివరించాడు. 
ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుందని, దాని గురించి ఆలోచిస్తే ఆట మీద శ్రద్ధ చూపలేమని అన్నాడు. తాము బాగా సాధన చేశామని, పరిస్థితులకు తగ్గట్టుగా ప్రపంచకప్ టోర్నీలో ఆడతామని చెప్పాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జట్టుని గెలిపించడమే ముఖ్యమని, దేశం తరఫున ప్రాతినిథ్యం వహించడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.