close

తాజా వార్తలు

టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే వాళ్లు ఆదుకోవాలి: కోహ్లీ

లండన్‌: టీమిండియా టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఆదుకోవాలని కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ సూచించాడు. ప్రపంచకప్‌లో భాగంగా శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కోహ్లీసేన నిరాశ పర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌-న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలింది. పాండ్య(30), జడేజా(54) ఆదుకోడంతో కనీసం 179 పరుగుల స్కోర్‌ సాధించింది.

ఈ విషయంపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో ఇంగ్లాండ్‌ పిచ్‌లపై కొన్నిసార్లు టాప్‌ఆర్డర్‌ విఫలమవ్వచ్చు. అయితే లోయర్‌ ఆర్డర్‌ సంయమనంతో ఆడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాలి. హార్దిక్‌పాండ్య, రవీంద్ర జడేజా, ధోనీ ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డారు. ఇవన్నీ శుభ పరిణామమే. 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో మా జట్టు 179 పరుగులు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే అది పోరాడే స్కోరే. అయితే మేం ప్రణాళికలు రచించి ఆడలేదు. మా బౌలర్ల ప్రదర్శన బాగుంది. ఓవర్‌కి 4.5 సగటున పరుగులు ఇచ్చాము. ఇక ఆటలో ఫీల్డర్లు ముఖ్య భూమిక పోషిస్తారు. కొన్ని అవకాశాలు చాలా విలువైనవి. అన్ని విభాగాల్లో మేం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది’ అని వివరించాడు. 

అనంతరం న్యూజిలాండ్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ‘కొత్త బంతితో కాస్త స్వింగ్‌ దొరికింది. అయితే అది స్పిన్నర్లకు అనుకూలించలేదు. తదుపరి మ్యాచ్‌లో వారికి అవకాశం ఇస్తా. రెండో ఇన్నింగ్స్‌ కన్నా మొదటి ఇన్నింగ్స్‌లోనే బంతి కాస్త స్వింగ్‌ అయింది. తర్వాత అది జరగలేదు. హెన్రీ నికోల్స్‌ టాప్‌ఆర్డర్‌తో పాటు మిడిల్ఆర్డర్‌లోనూ రాణించగలడు. టామ్స్‌ లాథమ్స్‌ వేలికి గాయం కారణంగా కొలిన్‌మన్రోకి ఓపెనింగ్‌ అవకాశం ఇచ్చాం. మా బ్యాటింగ్‌ లైనప్‌ స్థిరంగా ఉండేలా చూసుకుంటాం. ఇక టీమిండియా లాంటి మేటి జట్టుపై విజయం సాధించడం ఎప్పటికీ ప్రత్యేకమే’ అని పేర్కొన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.