close

తాజా వార్తలు

చెర్రీ, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి

ఉపాసన

కేప్‌టౌన్‌: రామ్‌చరణ్‌, నేను కలిసి జీవితంలో సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయని అంటున్నారు ఉపాసన. త్వరలో చెర్రీ, ఉపాసన తమ ఏడో పెళ్లి రోజును సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ దక్షిణాఫ్రికా విహారయాత్రకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉపాసన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘చరణ్‌కు ప్రేమలో పడటంపై నమ్మకం లేదు. కానీ ప్రేమ నుంచి ఎదగాలనుకుంటారు. ఇది వినడానికి కాస్త వింతగానే ఉంటుందనుకోండి. మా పెళ్లై అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాం. ఇద్దరం ఇంకా ముప్పైల వయసులోనే ఉన్నాం. మేమింకా సాధించాల్సినవి చాలా ఉన్నాయి. ప్రతి పెళ్లి రోజుకీ మేం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అనుకుంటాం. డైవింగ్‌, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ ఇలా ఏదో ఒకటి నేర్చుకుంటాం. జూన్‌ 14న మా పెళ్లిరోజు. కాకపోతే మేం ముందుగానే మా పెళ్లిరోజును జరుపుకోవాలని అనుకున్నాం. ఎందుకంటే.. జూన్‌ నుంచి చరణ్‌ షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు. ఆయన కాలికి గాయం అయింది. దాంతో కాస్త విరామం తీసుకున్నారు. మాకు నడక అంటే చాలా ఇష్టం. కానీ చరణ్‌కు గాయం తగ్గలేదు. అందుకే ఎక్కువగా తిరగకుండా విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నాం’ అని వెల్లడించారు ఉపాసన.

చరణ్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల చరణ్‌ కాలికి, తారక్‌ చేతికి గాయం కావడంతో చిత్రీకరణ కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు. త్వరలో మరో షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు. 2020 జులై 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.