close

తాజా వార్తలు

సచిన్‌ మెచ్చిన ఆటగాళ్లెవరో తెలుసా?

టీమిండియా క్రికెటర్లు కాకుండా..

లండన్‌: ప్రపంచకప్‌ 2019 ఆరంభమైంది. ఇంగ్లాండ్‌ X దక్షిణాఫ్రికా మధ్య తొలిపోరు రసవత్తరంగా సాగుతుందనుకుంటే ఏకపక్షంగా సాగింది. ఇంగ్లాండ్‌ 104 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందూల్కర్‌ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా మారారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌పై బ్యాట్‌ పట్టిన మాస్టర్‌ బ్లాస్టర్‌ ఇప్పుడు ప్రపంచకప్‌ సందర్భంగా మైక్‌ అందుకున్నారు. ఈ నేపథ్యంలో తన సహచర ఆటగాళ్లు వీరేందర్‌ సెహ్వాగ్‌, సౌరభ్‌ గంగూలీలతో కలిసి ఆయన వ్యాఖ్యానం చేశారు.

కామెంటరీ జరుగుతుండగా ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లోఅత్యుత్తమ క్రికెటర్లని ఎంపిక చెయ్యమని సచిన్‌ను అడగ్గా.. బ్యాట్స్‌మెన్‌లో ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ పేరునుఎంపిక చేసి, బౌలర్లలో ఇంగ్లాండ్‌ సంచలన బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ పేరును ప్రకటించాడు. అనంతరం కొద్దిసేపటికే ఆర్చర్‌ ముగ్గురు దక్షిణాఫ్రికా ఆటగాళ్లని ఔట్‌ చేసి సచిన్‌ ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. ఇక అఫ్గానిస్థాన్ స్పిన్‌బౌలర్‌ రషీద్‌ఖాన్‌ని రెండో అత్యుత్తమ బౌలర్‌గా సచిన్‌ పేర్కొన్నాడు. ఆ జట్టులోఅతడే కీలక ఆటగాడని లిటిల్‌ మాస్టర్‌ అభిప్రాయపడ్డాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.