close

తాజా వార్తలు

దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ!

గాయంతో స్టెయిన్‌ టోర్నీ మొత్తానికి దూరం


 

సౌథాంప్టన్‌: ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే వరుస పరాజయాలతో ఢీలా పడిన దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆ జట్టు పేస్‌ బౌలర్‌ డేల్‌ స్టెయిన్‌ ఈ టోర్నీ మొత్తానికే దూరమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వార్తను ఐసీసీ తన ట్విటర్‌ ఖాతా ద్వారా పేర్కొంది. భుజానికి గాయం కారణంగా స్టెయిన్‌ ఈ వరల్డ్‌కప్‌ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థానంలో ఫాస్ట్‌ బౌలర్‌ హేండ్రిక్స్‌ సఫారీ జట్టుతో కలువనున్నట్లు తెలిసింది. స్టెయిన్‌ చాలా కాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడు ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ తక్కువ మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత వెంటనే చికిత్స నిమిత్తం దక్షిణాఫ్రికాకు తిరిగివచ్చాడు. కాగా, వరల్డ్‌కప్‌లోగా స్టెయిన్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని ఆ జట్టు సారథి డుప్లెసిస్‌ కూడా టోర్నీ ఆరంభంలో పేర్కొన్నాడు. కానీ గాయం తీవ్రతలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ మెగా టోర్నీ మొత్తానికే దూరమైనట్లు తెలిసింది. 
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టును గాయల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఆ జట్లు ఫాస్ట్‌ బౌలర్‌ లుంగి ఎంగిడి గాయంతో 10 రోజులు ఆటకు దూరమయ్యాడు. మరి ఇలాంటి కఠిన పరిస్థితుల్లో బుధవారం భారత్‌తో మ్యాచ్‌లో
ఆ జట్టు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.