close

తాజా వార్తలు

అఫ్గాన్‌ వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఔట్‌

ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమణ

లండన్‌: అఫ్గానిస్థాన్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ షాజాద్‌ ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అఫ్గాన్‌ బ్యాటింగ్‌లో కీలక ఆటగాడైన అతను పాకిస్థాన్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో గాయపడ్డారు. అతని మోకాలికి గాయమైంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో  జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడిన షాజాద్‌.. గాయం తీవ్రత కారణంగా  ఇక మీదట జరిగే ఆటలకు దూరమయ్యాడు. అతడి స్థానంలో మరో యువ క్రికెటర్‌కు చోటు కల్పించారు. 

కాగా 2015 ప్రపంచకప్‌ నుంచి అఫ్గాన్‌కు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న షాజాద్‌ 55 మ్యాచ్‌ల్లో 1843 పరుగులు చేశాడు. టాప్‌ ఆర్డర్‌లో కీలకమైన ఆటగాడిని కోల్పోవడం అఫ్గాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే. అతడి స్థానంలో 18 ఏళ్ల యువక్రికెటర్‌ ఇక్రం అలీ ఖిల్‌ను ఆ జట్టు ఎంపిక చేసింది.

ఇదిలా ఉండగా ఖిల్‌.. అఫ్గాన్‌ తరఫున ఇప్పటివరకు ఆడింది రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లే కావడం విశేషం. ఈ ఏడాది మార్చిలో డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అరంగేట్రం చేశాడు. 2018లో అఫ్గాన్‌ తరఫున అండర్‌ 19 ప్రపంచకప్‌ జట్టులో ఆడిన అనుభవం అతడి సొంతం. ఆ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో 185 పరుగులు చేశాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన అఫ్గాన్‌ 8న న్యూజిలాండ్‌తో తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.