close

తాజా వార్తలు

రాయ్‌ ఊచకోత: బంగ్లాకు ఇంగ్లాండ్‌ లక్ష్యం 387

కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ భారీ స్కోర్లు సాధిస్తోంది. టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ 300+ స్కోరు చేసింది. బంగ్లాదేశ్‌కు 387 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (153; 121 బంతుల్లో 14×4, 5×6) విధ్వంసకర శతకం బాదేశాడు. అతడికి తోడుగా జానీ బెయిర్‌స్టో (51; 50 బంతుల్లో 6×4), జోస్‌ బట్లర్‌(64; 44 బంతుల్లో 2×4, 4×6) అర్ధశతకాలు సాధించడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. సైఫుద్దీన్‌, మెహదీ హసన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మొర్తజా, ముస్తాఫిజురు చెరో వికెట్‌ తీశారు.

ఐదో ఓవర్‌ నుంచి..
ఆరంభంలో ఇంగ్లాండ్‌ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. షకిబ్‌, మొర్తజా వారిని నియంత్రించారు. ఐతే ఆరో ఓవర్‌ నుంచి జేసన్‌ రాయ్‌ బాదుడు మొదలు పెట్టాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించాడు. మరోవైపు జానీ బెయిర్‌ స్టో కాస్త ఆలస్యంగా జోరు అందుకున్నాడు. 5 ఓవర్‌కు 15గా ఉన్న స్కోరు 10 ఓవర్లకు 67గా మారింది. అదే ఊపులో రాయ్‌ భారీ సిక్సర్‌, బౌండరీతో అర్ధశతకం అందుకున్నాడు. 19వ ఓవర్‌లో బెయిర్‌స్టో సైతం అర్ధశతకం సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఎట్టకేలకు 20వ ఓవర్‌లో బంగ్లాకు తొలి వికెట్‌ దక్కింది. బెయిర్‌స్టోను మొర్తజా ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో జోరూట్‌(21)తో కలిసి రాయ్‌ విధ్వంసకరంగా ఆడాడు. శతకం బాదేశాడు. జట్టు స్కోరు 205 వద్ద రూట్‌ వెనుదిరగడంతో బట్లర్‌ క్రీజులోకి వచ్చాడు.

బట్లర్ బాదుడు
తొలుత ఆచితూచి ఆడిన బట్లర్‌ నిలకడగా బాదుడు మొదలు పెట్టాడు. 35వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదిన రాయ్‌ 150 చేశాడు. ఆరు సిక్సర్లు బాదాలనే ఉద్దేశంతో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత బట్లర్‌, మోర్గాన్‌(35) స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 4వ వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బట్లర్‌ అద్భుతమైన సిక్సర్లతో అలరించాడు. అతడి వీరబాదుడుకు బంతి స్టేడియం బయటకు వెళ్లింది. ఐతే 330 వద్ద బట్లర్‌, 340 వద్ద మోర్గాన్‌ ఔటయ్యారు. చివర్లో క్రిస్‌వోక్స్‌ (18*; 8 బంతుల్లో 2×6), లియామ్‌ ఫ్లంకెట్‌ (27*; 9 బంతుల్లో 4×4, 1×6) ధాటిగా ఆడి ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు అందించారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.