Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 110281
            [news_title_telugu_html] => 

‘జెర్సీ నంబర్‌ 12’కు బీసీసీఐ వీడ్కోలు పలకాలి

[news_title_telugu] => ‘జెర్సీ నంబర్‌ 12’కు బీసీసీఐ వీడ్కోలు పలకాలి [news_title_english] => BCCI should retire No 12 jersey [news_short_description] => ఎన్నెన్నో జ్ఞాపకాలు. అతడు కొట్టిన ఆరు సిక్సర్లు ఎంత అలరించాయో! ఎన్నెన్నో పోరాటాలు. 2011 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగు సార్లు ఛాంపియన్‌ ఆసీస్‌పై అతడి యుద్ధం అద్భుతం. ఎన్నెన్నో ఘనతలు. టీమిండియా తరఫున అన్ని... [news_tags_keywords] => yuvraj singh,yuvi,schin tendulkar,gambhir,sehwag [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-10 17:42:10 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘జెర్సీ నంబర్‌ 12’కు బీసీసీఐ వీడ్కోలు పలకాలి - BCCI should retire No 12 jersey - EENADU
close

తాజా వార్తలు

‘జెర్సీ నంబర్‌ 12’కు బీసీసీఐ వీడ్కోలు పలకాలి

హైదరాబాద్‌: ఎన్నెన్నో జ్ఞాపకాలు.. అతడు కొట్టిన ఆరు సిక్సర్లు ఎంత అలరించాయో! ఎన్నెన్నో పోరాటాలు.. 2011 ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగు సార్లు ఛాంపియన్‌ ఆసీస్‌పై అతడి యుద్ధం అద్భుతం. ఎన్నెన్నో ఘనతలు.. టీమిండియా తరఫున అన్ని విభాగాల్లో ప్రపంచకప్‌లు ఆడేశాడు. ఎన్నెన్నో ఎత్తు పల్లాలు.. కాన్సర్‌పై విజయం సాధించిన తర్వాత కెరీర్‌లో నిలకడ లేమి. ఇలా చెప్పుకొంటూ పోతే టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ గురించి ఎన్నో విశేషాలు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో యువీ అందరి మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. అందుకే అతడి సేవలను గుర్తు చేసుకుంటున్న సహచరులు, అభిమానులు ‘జెర్సీ నంబర్‌ 12’కు వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐని కోరుతున్నారు. #Yuvarajsinghretires, #ThankYouYuvraj, #ThankYouYuvi, #YUVSTRONG12 హ్యాష్‌టాగులతో అభిమానులు సోషల్‌ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.

టగాళ్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ, యువరాజ్‌ సింగ్‌ లాంటి వాళ్లు మాత్రం అత్యంత అరుదు. ఎన్నో కష్టాలను అనుభవించాడు. క్యాన్సర్‌ను జయించాడు. బౌలర్లను చితకబాదాడు. హృదయాలు గెలుచుకున్నాడు. అతడి పోరాటం, ఆత్మవిశ్వాసంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. నీకంతా మంచే జరగాలి యువీ. - వీరేంద్ర సెహ్వాగ్‌ 

నీదెంత అద్భుతమైన కెరీర్‌ యువీ. జట్టుకు అవసరమైన ప్రతిసారీ ఓ విజేతగా తిరిగొచ్చావు. ఒడుదొడుకుల్లో, మైదానంలో నువ్వు పడిలేచిన విధానం అద్భుతం. నీ రెండో ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు. క్రికెట్‌కు నువ్వు చేసిన సేవలకు ధన్యవాదాలు. - సచిన్‌ తెందుల్కర్‌

 

దేశం తరఫున అద్భుతంగా ఆడినందుకు అభినందనలు. మాకు నువ్వెన్నో విజయాలు, మధుర జ్ఞాపకాలు అందించావు. నీకంతా మంచే జరగాలి. నువ్వు నిజమైన విజేతవు. - విరాట్‌ కోహ్లీ

హ్యపీ రిటైర్‌మెంట్‌, పై చక్కర్‌! గుర్తిండిపోయే నీ కెరీర్‌లో ఎన్నో ఒడుదొడుకులు. అత్యున్నత స్థాయికి చేరావు. కొన్నిసార్లు కిందపడ్డావు. నీలం రంగు జెర్సీలో పునరుత్తేజం, ధైర్య సాహసాలు, తెలివితేటలు ప్రదర్శించావు. - కెవిన్‌ పీటర్సన్‌

అభినందనలు ప్రిన్స్‌. యువీ నీది అద్భుతమైన కెరీర్‌. భారత క్రికెట్‌లో అత్యుత్తమ తెలుపు బంతి క్రికెటర్‌ నువ్వు. అతడి కెరీర్‌కు గుర్తుగా బీసీసీఐ జెర్సీ నంబర్‌ 12కు రిటైర్‌మెంటు ఇవ్వాలి. ఓ విజేతా! నేను నీలా ఆడాలని కోరుకునేవాడిని. - గౌతమ్ గంభీర్‌

ఒక శకం ముగిసింది! బ్యాటింగ్‌లో నీ సామర్థ్యం, మెరుపు 6 సిక్సర్లు, అద్భుతమైన క్యాచ్‌లు, మనం కలిసున్న మధురమైన కాలం.. ఇప్పుడు మిస్సవుతున్నా. మైదానంలో నీ క్లాస్‌, నీ పట్టుదల నిరంతర స్ఫూర్తిని రగిలించాయి. థ్యాంక్యూ యువీ. నీ రెండో ఇన్నింగ్స్‌ అద్భుతంగా సాగాలి. - సురేశ్‌ రైనా 

యువీ నీతో ఆడటం నాకెంతో సంతోషం. క్రికెట్‌ చరిత్రలో నువ్వొక గొప్ప ఆటగాడిగా నిలిచిపోతావు. నీ పునరాగమనం, పట్టుదలతో మాకు స్ఫూర్తినిచ్చావు. అంతకన్నా ఎక్కువగా ఆటను ప్రేమించావు. ఆస్వాదించావు. గుడ్‌లక్‌ యువీ. - వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఓ సోదరుడు. ఓ మార్గదర్శి. ఓ యోధుడు. మనసున్న మనిషి. ఆటలో దిగ్గజం. నీ తర్వాతి జీవితానికి ఆల్‌ ద బెస్ట్‌ యువీ.  - రిషభ్‌పంత్‌

అద్భుత తెలివి తేటలున్న భారత బ్యాట్స్‌మన్‌. గొప్ప మ్యాచ్‌ విన్నర్‌. తొలి ఇన్నింగ్స్‌లాగే నీ రెండో ఇన్నింగ్స్‌ సైతం బాగుండాలి. - ఆకాశ్‌ చోప్రా

వెల్‌డన్‌ యువీ పా. మైదానంలో, బయటా నువ్వో దిగ్గజం, యోధుడు, స్ఫూర్తి, మిత్రుడివి. నీ రెండో ఇన్నింగ్స్‌ ఇంకా విజయవంతంగా ఉంటుందని భావిస్తున్నా. మంచోళ్లకు అంతా మంచే జరుగుతుంది. - పార్థివ్‌ పటేల్‌

ఆ నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌, ఆ ఆరు సిక్సర్లు, ఆ ప్రపంచకప్‌! నాకెప్పుడూ గుర్తుంటాయి. నీ సలహాలు, మద్దతుకు ధన్యవాదాలు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వొక స్ఫూర్తి. నిన్ను మిస్సవుతున్నాం. - మయాంక్‌ అగర్వాల్‌

అద్భుతమైన ప్రయాణానికి, తిరుగులేనీ క్రికెట్‌ కెరీర్‌కు అభినందనలు యువీ. నీకంతా మంచే జరగాలి. -ప్రజ్ఞాన్‌ ఓజా 

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌ విన్నర్లలో ఒకడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని యోధుడిలా తన కెరీర్‌ను అద్భుతంగా మలుచుకున్నాడు. ప్రతిసారీ విజేతగా నిలిచాడు. యువీ నిన్ను చూసి మేమంతా గర్విస్తున్నాం. దేశానికి నువ్వు చేసిన దానికి గర్వపడు. - మహ్మద్‌ కైఫ్‌

చక్కగా ఆడావు యువీ. సచిన్‌ ఒకప్పుడు చెప్పినట్టు భారత్‌కు అవసరమైన ప్రతిసారీ నువ్వు నిలిచావు. నీ ఆట, ఆ బ్యాట్‌ స్వింగ్‌ నా మదిలో మెదులుతున్నాయి. నీ జీవితం బాగుండాలి. - హర్షభోగ్లే

నా పోరాట యువరాజు, మైదానంలో, బయటా నిజమైన యోధుడు. నీ కథలు అజరామరం. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను యువీ. -హర్భజన్‌సింగ్‌ 

        


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.