Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 110306
            [news_title_telugu_html] => 

విదేశీ టీ20ల్లో యువీకి బీసీసీఐ అనుమతి!

[news_title_telugu] => విదేశీ టీ20ల్లో యువీకి బీసీసీఐ అనుమతి! [news_title_english] => Yuvraj likely to get BCCIs approval for participation in overseas T20 leagues [news_short_description] => విదేశీ టీ20 లీగుల్లో సరదా క్రికెట్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్న యువరాజ్‌ సింగ్‌ కోరికకు బీసీసీఐ సమ్మతించే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌, దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌కు యువీ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే..... [news_tags_keywords] => yuvraj singh,Team India,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-11 02:12:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విదేశీ టీ20ల్లో యువీకి బీసీసీఐ అనుమతి! - Yuvraj likely to get BCCIs approval for participation in overseas T20 leagues - EENADU
close

తాజా వార్తలు

విదేశీ టీ20ల్లో యువీకి బీసీసీఐ అనుమతి!

దిల్లీ: విదేశీ టీ20 లీగుల్లో సరదా క్రికెట్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్న యువరాజ్‌ సింగ్‌ కోరికకు బీసీసీఐ సమ్మతించే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌, దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌కు యువీ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘యువీ బోర్డును అనుమతి కోరుతూ ఇంకా లేఖ రాయలేదు. అందిన వెంటనే దానిని పరిశీలిస్తాం. అతడు ఐపీఎల్‌ ఆడటం లేదు కాబట్టి విదేశీ లీగుల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించేందుకు అవకాశాలు చాలా తక్కువ. అతడి స్థాయి గల మాజీ క్రికెటర్లు భారత్‌ ఆవల ఆడేందుకు అనుమతి ఇస్తాం’ అని బీసీసీఐలోని ఓ అధికారి తెలిపారు.

‘వీడ్కోలు పలికిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్‌ విదేశీ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు యువరాజ్‌ సింగ్‌ అదే చేస్తానంటే అందులో సమస్యేమీ లేదు. అతనిప్పుడు రిటైర్‌ అయ్యాడు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవ చేశాడు. అతనికెప్పుడూ గౌరవం ఉంటుంది’ అని మరో అధికారి తెలిపారు. వీరూ, జహీర్‌ టీ10 క్రికెట్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం విదేశీ క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐ అనుమతి కోరాడు. అయితే బోర్డు పరిధిలో క్రికెట్‌ ఆడుతున్న వారికి బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.