close

తాజా వార్తలు

సోదరా..! నువ్విక లెజెండ్‌గా ఎదిగిపో..

యువీకి.. రోహిత్‌ వీడ్కోలు సందేశం

లండన్‌: టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ ఘన వీడ్కోలుకు అర్హుడని భారత ఓపెనర్‌, వైస్‌కెప్టెన్‌ రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. యువీ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా రోహిత్‌ పై విధంగా ట్వీట్‌చేశాడు. ‘నీకు అందివచ్చింది ఏంటో అది కోల్పోయేదాకా నీకు తెలియదు. సోదరా.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంటా. ఘన వీడ్కోలుకు నువ్వు అర్హుడివి. నా మనసులో ఏమనుకుంటానో తెలుసా! నిన్ను అమితంగా ఇష్టపడుతుంటా. నువ్విక లెజెండ్‌గా ఎదగాలి’ అని ట్విటర్‌లో పోస్టు చేశాడు.  

ఇదిలా ఉండగా యువీ .. సమయమొచ్చినప్పుడు ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తానని చెప్పాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌ జరుగుతున్నందున ఎలాంటి వివాదాలకు చోటివ్వదలచుకోలేదని, కచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నాడు. జీవితంలో ఇక ముందుకు వెళ్లేందుకే తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నానని వివరించాడు.

 యువరాజ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే పలువురు ప్రముఖులు అతడి సేవలను గుర్తుచేసుకుంటూ వీడ్కోలు సందేశాలు తెలుపుతున్నారు. టీమిండియా తరఫున 2000లో కెన్యాపై అరంగేట్రం చేసిన సీనియర్‌ క్రికెటర్‌ 2017లో వెస్టిండీస్‌పై ఆఖరి వన్డే ఆడాడు. ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 22వ స్థానంలో ఉన్న యువీ టీమిండియా తరఫున ఏడో ఆటగాడిగా నిలిచాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.