close

తాజా వార్తలు

నేను బోర్డులోకి రావాలనుకోవడంలేదు

 యస్‌బ్యాంక్‌ మాజీ సీఈవో రాణా కపూర్‌

ముంబయి: తనకు మళ్లీ బోర్డులోకి వచ్చే ఉద్దేశం లేదని యస్‌బ్యాంక్ మాజీ సీఈవో, కో ప్రమోటర్‌ రాణా కపూర్‌ తెలిపారు. కొత్త సీఈవో రవనీత్‌ గిల్‌పై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. బ్యాంక్‌ బోర్డులో చేరే ఉద్దేశం లేదన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. జూన్‌ 12 న నిర్వహించిన బ్యాంక్‌ ఏఎంజీలో ప్రతిపాదించిన 19 తీర్మానాలకు ప్రమోటర్లు మద్దతు పలికారన్నారు. 
ఇటీవల ఆయన బోర్డులో చేరేందుకు సిద్ధమయ్యారని.. ఈ మేరకు ఆయనకు కోట్లలో వేతన ప్యాకేజీ కూడా సిద్ధమైందని ఒక ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఈ విషయంపై బోర్డులో అభిప్రాయభేదాలు తలెత్తాయని పేర్కొంది. ఈ అంశాన్ని  కపూర్‌ నేడు ట్విటర్‌లో తోసిపుచ్చారు. బోర్డు సభ్యులకు తన పూర్తి మద్దతు ఉందని తెలిపారు. ఇటీవలే బోర్డు నుంచి ఇద్దరు కీలక డైరెక్టర్లు వైదొలగాక ఈ ప్రకటన వెలువడింది. నామినేషన్స్‌, రెమ్యూనిరేషన్స్‌ కమిటీ ఛైర్మన్‌ ముఖేష్‌ సబర్వాల్‌, మధ్యంతర సీఈవో అజేయ్‌ కుమార్‌లు ఇటీవల వైదొలగిన విషయం తెలిసిందే. 

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.