close

తాజా వార్తలు

పాకిస్థాన్‌పై ఇది మరో స్ట్రైక్‌ : అమిత్‌షా

టీమిండియాపై ప్రశంసల వర్షం

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌పై టీమిండియాది మరో స్ట్రైక్‌ అని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. ప్రపంచకప్‌లో భారత్‌ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పాక్‌ను ఏడోసారి చిత్తు చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట రోహిత్‌ శతకంతో చెలరేగితే తర్వాత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ నేతలతో పాటు మరి కొందరు ప్రముఖులు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు.

ఎవరమన్నారంటే..

 కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షా-పాకిస్థాన్‌పై.. టీమిండియా మరో స్ట్రైక్‌ చేసింది. అదే ఫలితం. మంచి ప్రదర్శన చేసినందుకు అభినందనలు. మీ విజయంతో ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నాడు.  

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన టీమిండియాకు అభినందనలు. ఈ విజయం కోసం కోహ్లీసేన అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది.  -రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌                                                

భారత్‌ గొప్పగా ఆడింది. అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు. జైహింద్‌!- కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి                                                                                     

టీమిండియా గెలిచి, పాకిస్థాన్‌ ఓడిపోతుందని నేను ముందే చెప్పాను. మన కుర్రాళ్లు బాగా ఆడారు. అభినందనలు.-కేంద్ర మంత్రి రిజీజు                                                                 

పాకిస్థాన్‌పై మరో అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు. ఈ ప్రపంచకప్‌లో ఆడబోయే అన్ని మ్యాచ్‌లకు కోహ్లీ బృందానికి శుభాకాంక్షలు.-కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌                            

పరుగులు, వర్షం.. సంపూర్ణ ఆధిపత్యం..  ఇది #7-0. జైహింద్‌!-టీమిండియా మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌గంభీర్‌                                                                                                           

అద్భుత విజయం సాధించిన టీమిండియాకి అభినందనలు-కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌                                                                                                             -

పాకిస్థాన్‌పై ఎదురులేని విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు. మరోసారి దేశం గర్వపడేలా చేశారు. ధన్యవాదాలు.- కాంగ్రెస్‌ పార్టీ అధికారిక ట్వీట్‌                                                  

పాకిస్థాన్‌పై ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కోహ్లీసేనకు అభినందనలు. ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేశారు - రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌                                                        


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.