close

తాజా వార్తలు

దేశభక్తిని చాటిన మందు బాబులు

భారత్‌ X పాక్ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌లో ఘటన

హైదరాబాద్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం మాంచెస్టర్‌లో జరిగిన భారత్‌ X పాక్‌ మ్యాచ్‌లో కోహ్లేసేన 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆలపించిన జాతీయగీతానికి హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో మందుబాబులు లేచి నిలబడి దేశభక్తిని చాటుకున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

సహజంగా ఏ ఆట ప్రారంభానికి ముందైనా ఆయా జట్ల జాతీయ గీతాన్ని ఆలపించడం సాధారణ విషయమే. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న వాళ్లు లేచి నిలబడి ఆటగాళ్లతో పాటు గీతాన్ని ఆలపిస్తారు. ఇక టీవీల ముందు ఉన్న వారు సైతం నిలబడి తమ దేశభక్తిని చాటుకుంటుంటారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో మొన్న జరిగిన మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో మందు తాగడానికి వచ్చిన వారు అక్కడి టీవీలో జాతీయ గీతం ప్రసారమయ్యేటప్పుడు లేచి నిలబడ్డారు. దీంతో దేశభక్తికి సమయం, సందర్భం, స్థలం లాంటి విషయాలతో సంబంధం లేదని నిరూపించారు. ఒకసారి మీరూ ఈ వీడియోని వీక్షించండి..

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.