
తాజా వార్తలు
ట్విటర్ ద్వారా పాకిస్థాన్ అభిమానులకు విజ్ఞప్తి
లండన్: ప్రపంచకప్లో భారత్ చేతిలో ఓటమిపాలైన పాకిస్థాన్ జట్టును ఆ దేశ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు అసభ్య పదాలతో మండిపడుతున్నారు. ఈ విషయంపై స్పందించిన పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ ట్విటర్ వేదికగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ‘దయచేసి మాపై అసభ్య పదాలను ఉపయోగించకండి. మా ప్రదర్శనపై విమర్శించండి. అంతే కానీ అలాంటి పదాలు వాడొద్దు. ఇకపై మేం మంచి ప్రదర్శన చేస్తాం. మాకు మీ మద్దతు కావాలి’ అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా ఆదివారం భారత్తో జరిగిన పోరులో పాకిస్థాన్ 89 పరుగులతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో పాక్ ఆటగాళ్ల ప్రదర్శన, వారి ప్రవర్తనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆటగాళ్లు మ్యాచ్కు ముందు రాత్రి విందులు చేసుకున్నారని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. దీంతో పాక్ బౌలర్ పై విధంగా ట్వీట్ చేశాడు. ఆమిర్ మెగా టోర్నీలో ఇప్పటికే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. భారత్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు. పాక్ ఈనెల 23న దక్షిణాఫ్రికాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
- నేటి నుంచే ఫాస్టాగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
