
తాజా వార్తలు
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల మోత మెగించాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 సిక్స్‌లు బాది వన్డే క్రికెట్లో సిక్సర్ల రికార్డులో నూతన చరిత్ర సృష్టించాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు సాధించిన క్రికెటర్‌గా మోర్గాన్ నిలిచాడు. ఇప్పటివరకూ వన్డేల్లో ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్ల జాబితాలో రోహిత్‌శర్మ(16 సిక్సర్లు), ఏబీ డివిలియర్స్(16), క్రిస్ గేల్(16) ముందు వరుసలో ఉన్నారు. తాజాగా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మోర్గాన్ ఈ రికార్డును అధిగమించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇన్నింగ్స్ 30ఓవర్లో క్రీజులోకి వచ్చిన మోర్గాన్ ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకపడ్డాడు. ఈ క్రమంలో 39ఓవర్లోనే అర్ధశతకం అందుకున్నాడు. జోరు సాగించిన ఈ ఇంగ్లాండ్ సారథి.. 43ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు బాది వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. అది కూడా 57బంతుల్లోనే అందుకోవడం విశేషం. ప్రపంచకప్‌లో ఇది నాలుగో వేగవంతమైన శతకం. తర్వాత దూకుడు పెంచిన మోర్గాన్ మొత్తంగా 71 బంతుల్లో 148 పరుగులు చేశాడు. ఇందులో బౌండరీలు నాలుగు మాత్రమే కాగా, సిక్స్‌లు మాత్రం ఏకంగా 17. ఇలా వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మోర్గాన్ నూతన రికార్డు నెలకొల్పాడు. ఇతని ధాటికి అఫ్గాన్ బౌలర్ల ఎకానమీ భారీగా పెరిగిపోయింది. రషీద్ ఖాన్ అయితే 9ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమీ పడగొట్టకుండా ఏకంగా 110పరుగులు ఇచ్చాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
