
తాజా వార్తలు
భారత్ X అఫ్గాన్ మ్యాచ్‌కు ముందు విజయ్‌శంకర్
సౌథాంప్టన్: ప్రపంచకప్‌లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. నేడు పసికూన అఫ్గాన్‌తో కోహ్లీసేన తలపడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో విజయ్‌శంకర్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం పెద్దదేమీ కాదని, అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమిండియా యాజమాన్యం వెల్లడించింది. మరోవైపు విజయ్‌శంకర్ కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన విజయ్.. మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
కాగా అఫ్గాన్ ప్రధాన బౌలర్ రషీద్‌ఖాన్‌పై ప్రపంచకప్ ముందు ఎన్నో అంచనాలు ఉండేవి. అయితే ఈ టోర్నీలో చెపుకోదగ్గస్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఇంగ్లాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 9 ఓవర్లలోనే ఏకంగా 110 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌కు అతడి బౌలింగ్‌లో పరుగులు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా విజయ్‌శంకర్ మీడియాతో మాట్లాడుతూ రషీద్ బౌలింగ్‌ను కొనియాడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రషీద్‌ఖాన్ ప్రపంచశ్రేణి బౌలరని పేర్కొన్నాడు. అతడితో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కలిసి ఆడిన అనుభవం ఉన్నందున రషీద్ బౌలింగ్‌ను ఎదుర్కొంటానని చెప్పాడు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా అతడి బౌలింగ్‌లో అనేక వైవిధ్యమైన బంతుల్ని ఎదుర్కొనేవాడినని విజయ్ వివరించాడు.