close

తాజా వార్తలు

ఇండస్‌ఇండ్‌లో హిందుజాల వాటాల పెంపు

ముంబయి: ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో హిందుజాలు వాటాలను పెంచుకొన్నారు. వారెంట్స్‌ ఇష్యూ ద్వారా రూ.2,700 కోట్లను బ్యాంక్‌లోకి తీసుకొచ్చారు. భారత్‌ ఫైనాన్షియల్‌ విలీనం తర్వాత ప్రమోటర్ల వాటాలను పెంచుకోవడాన్ని వేగవంతం చేశారు. ఈ విలీనం జులై4 నుంచి అమల్లోకి రానుంది. 
మా ప్రమోటర్లు మరో రూ.2,700 కోట్లను బ్యాంకులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా వాటాలను 15శాతంకు తీసుకురానున్నారని బ్యాంక్‌ స్ట్రాటజీ హెడ్‌ సంజేయ్‌ మాలిక్‌ తెలిపారు. ఈ మొత్తంలో నాలుగో వంతు వెంటనే బ్యాంకుకు అందుతుంది. మిగిలిన మొత్తం తర్వాత 18నెలల్లో బ్యాంకుకు చేరుతుంది. ప్రమోటర్లు ఒక్కోషేరును రూ.1,709 వద్ద కొనుగోలు చేశారు. శుక్రవారం ఈ బ్యాంక్‌ షేరు 1,448.70 వద్ద ముగిసింది. ఇటీవల భారత్‌ ఫైనాన్షియల్‌ విలీనంతో ప్రమోటర్ల వాటాలు 13శాతానికి తగ్గాయి. ఇప్పుడు వారెంట్స్‌ ఇష్యూ ద్వారా మళ్లీ వారి వాటాలు 15శాతంకు చేరనున్నాయి. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.