Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 116397
            [news_title_telugu_html] => 

ఇలా చూడటం కష్టంగా ఉంది: గ్రేమ్‌స్మిత్‌

[news_title_telugu] => ఇలా చూడటం కష్టంగా ఉంది: గ్రేమ్‌స్మిత్‌ [news_title_english] => It really has been difficult to watch by Graeme Smith [news_short_description] => పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమిపాలవ్వడంతో ఆ జట్టు ప్రపంచకప్‌ నుంచి  ఇంటిముఖం పట్టింది. తదుపరి శ్రీలంక, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఉన్నప్పటికీ ఆ జట్టుకి ఇవి... [news_tags_keywords] => Cricket,South Africa,World Cup 2019,PAKvsSA [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-24 12:22:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఇలా చూడటం కష్టంగా ఉంది: గ్రేమ్‌స్మిత్‌ - It really has been difficult to watch by Graeme Smith - EENADU
close

తాజా వార్తలు

ఇలా చూడటం కష్టంగా ఉంది: గ్రేమ్‌స్మిత్‌

దక్షిణాఫ్రికా ఓటమి అభిమానుల ఆగ్రహం

లండన్‌: పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమిపాలవ్వడంతో ఆ జట్టు ప్రపంచకప్‌ నుంచి  ఇంటిముఖం పట్టింది. తదుపరి శ్రీలంక, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఉన్నప్పటికీ ఆ జట్టుకి ఇవి నామమాత్రంగానే మిగిలాయి. అయితే ప్రపంచప్‌లో ఇంత దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న సఫారీలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు ఆ జట్టు మాజీ క్రికెటర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా 1992 నుంచి ప్రపంచకప్‌లో పాల్గొంటున్న దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా విశ్వవిజేత కాలేదు. 

ప్రతీసారి ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా బరిలో దిగడం.. సెమీస్‌ వరకు చేరడం.. ఏదో ఒక కారణంతో మెగా ఈవెంట్‌ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకి శాపంలా మారింది. ఈసారి మరీ దారుణంగా కనీస పోటీ కూడా ఇవ్వకుండా లీగ్‌ స్టేజీలోనే నిష్క్రమించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ను తీసుకోకపోవడంతో పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ జట్టుని ఇలా చూడటం చాలా బాధగా ఉందని మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌స్మిత్‌ పేర్కొన్నాడు. మాజీ బౌలర్‌ అలెన్‌ డొనాల్డ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘ఈ ప్రపంచకప్ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది’ అని హెచ్చరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.