close

తాజా వార్తలు

షేక్‌ చేసిన షకిబ్‌: అఫ్గాన్‌పై బంగ్లా విజయం

సౌథాంప్టన్‌: బంగ్లా పులులు మరోసారి గర్జించాయి. సీనియర్‌ ఆటగాడు షకిబ్‌ అల్‌ హసన్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టడంతో అఫ్గాన్‌ చిత్తుగా ఓడిపోయింది. 263 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు 47 ఓవర్లకు 200కే పరిమితమైంది. బంగ్లా 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛేదనలో సమీముల్లా షెన్వారి (49*; 51 బంతుల్లో), గుల్బదిన్‌ నయీబ్‌ (47) రాణించారు. అంతకు ముందు బంగ్లాలో ముష్ఫికర్‌ రహీమ్‌ (83; 87 బంతుల్లో 4×4, 1×6), షకిబ్‌ (51; 69 బంతుల్లో 1×4) అర్ధశతకాలు సాధించారు.

యువీ రికార్డు బద్దలు

బంగ్లా ఆల్‌రౌండర్‌ షకిబ్‌ 2011 ప్రపంచకప్‌లో యువరాజ్‌ సింగ్‌ నెలకొల్పిన అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటుతో 51 పరుగులు చేసి బంతితో 5 వికెట్లు పడగొట్టాడు. 10 ఓవర్లు విసిరి 1 మెయిడిన్‌ నమోదు చేశాడు. 29 పరుగులే ఇచ్చాడు. గతంలో యువీ నెదర్లాండ్స్‌పై 50; 5/31 నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఛేదనలో అఫ్గాన్‌కు శుభారంభం దక్కింది. రెహ్మత్‌ షా (24), గుల్బదిన్‌ నయీబ్‌ (47) దూకుడుగా ఆడి తొలి వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం అందించారు. రెహ్మత్‌ను ఔట్‌ చేసి షకిబ్‌ బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత అఫ్గాన్‌ త్వరగానే వికెట్లు పోగొట్టుకుంది. షాహిది (11), అస్ఘర్‌ (20), మహ్మద్‌ నబీ (0) విక్రమ్‌ అలీ (11) విఫలమయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా సమీముల్లా షెన్వారి వీరోచితంగా పోరాడాడు. ఏడో వికెట్‌కు నజీబుల్లా జర్దాన్‌ (23; 23 బంతుల్లో 2×4)తో కలిసి 56 పరుగుల భాగస్వామ్యం అందించాడు. చివర్లో ముస్తాఫిజుర్‌ 2 వికెట్లు తీసి బంగ్లాకు విజయం అందించాడు.

ఆదుకున్న రహీమ్‌ 

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు  23 వద్దే లిటన్‌ దాస్‌ (16)ను ముజీబ్‌ పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో షకిబ్‌తో కలిసి తమీమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే తమీమ్‌ను నబీ బోల్తా కొట్టించాడు. అప్పుడు జట్టు స్కోరు 82. ఈ క్రమంలో ముష్ఫికర్‌ అండతో షకిబ్‌ అర్ధశతకం సాధించాడు. 61 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. కీలకమైన దశలో షకిబ్‌ను ముజీబ్‌ కళ్లుచెదిరే బంతితో ఎల్బీ చేశాడు. కొద్ది సమయంలోనే సౌమ్య సర్కార్‌ (3)నూ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కష్టాల్లో పడ్డ బంగ్లాను ముష్ఫికర్‌ రహీమ్‌ ఆదుకున్నాడు. సమయోచితంగా ఆడుతూ అర్ధశతకం అందుకున్నాడు. మరోవైపు మహ్మదుల్లా (27) గాయపడ్డా అతడికి సహకారం అందించాడు. జట్టు స్కోరు 207 వద్ద అతడిని నయీబ్‌ బోల్తా కొట్టించాడు. చివర్లో మొసాదిక్‌తో కలిసి రహీమ్‌ 44 పరుగుల భాగస్వామ్యం అందించి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. శతకానికి చేరువయ్యే క్రమంలో రహీమ్‌ను దవ్లత్‌, దూకుడుగా ఆడుతున్న మొసాదిక్‌ను నయీబ్‌ ఔట్‌ చేశాడు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.