close

తాజా వార్తలు

ఆసుపత్రి నుంచి లారా డిశ్చార్జ్‌

ముంబయి: ఛాతి నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరిన బ్రయిన్‌ లారా డిశ్చార్జ్‌ అయ్యాడు. లారా ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఈ రోజు మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామని వైద్యులు తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పిన వాయిస్‌ మెసేజ్‌ను లారా నిన్న రాత్రి విడుదల చేశాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను కూడా వీక్షించానని చెప్పాడు. ముంబయిలోని ఓ కార్యక్రమానికి హాజరైన లారాకు ఛాతి నొప్పి రావడంతో ఆయనను మంగళవారం పరేల్‌ ప్రాంతంలో గ్లోబల్‌ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ విశ్లేషకుడిగా ఓ ప్రసార సంస్థ కోసం భారత్‌ నుంచి లారా పని చేస్తున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.