close

తాజా వార్తలు

నాలుగో స్థానంలో ధోనినే!

లండన్‌: ప్రపంచకప్‌ ముందు భారత జట్టు తరఫున నాలుగో స్థానంలో బరిలోకి దిగేదెవరని అందరిలోనూ ఆసక్తి రేకెత్తింది. రాహుల్‌కు అవకాశం ఇవ్వడం, అతను ఫర్వాలేదనిపించడంతో నాలుగో స్థానానికి సమాధానం దొరికిందని భావించారంతా. కానీ ధావన్‌ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో ఓపెనర్‌గా రాహుల్‌ అవతారమెత్తాడు. దీంతో విజయ శంకర్‌కు అవకాశమిచ్చారు. అయితే శంకర్‌ వరుసగా విఫలమవ్వడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఆసీస్‌ మాజీ ఆటగాడు డీన్‌ జోన్స్‌ దీనికి పరిష్కారమార్గం చెప్పాడు. ధోనిని నాలుగో స్థానంలో ఆడించాలని, రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకురావాలని పేర్కొన్నాడు. 

‘టోర్నీలో విజయాలతో దూసుకెళ్తున్న జట్టులో ఎటువంటి మార్పులు చేయాలనుకోరు. ప్రస్తుతం భారత్‌ టాప్‌ గేర్‌లో వెళ్తోంది. కానీ నేను నాలుగో స్థానం గురించి ఆలోచిస్తున్నాను. ధోనిని ఆ స్థానంలో బరిలోకి దించి తుది జట్టులోకి జడేజాను తీసుకోవాలి. అతను బంతితోనూ రాణించగలడు. మ్యాచ్‌లు ఆడే కొద్ది పిచ్‌లలో మార్పులు వస్తాయి. అటువంటి సందర్భాలల్లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ టీమిండియాకు ఎంతో ఉపయోగపడతాడు.’ అని పేర్కొన్నాడు. 

నాలుగో స్థానం గురించి భారత్‌ పేసర్‌ ఇర్ఫాన్ పఠాన్‌ మరో విధంగా స్పందించాడు. విఫలమవుతున్న విజయ్‌ శంకర్‌కు మరిన్ని అవకాశాలు ఇచ్చే బదులుగా దినేశ్‌ కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలని అన్నాడు. ‘సెమీస్‌కు ముందు మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. రాణించని విజయ్‌ శంకర్‌ బదులుగా దినేశ్‌ కార్తీక్‌ అవకాశం ఇవ్వాలి. ఆదిలోనే భారత్ వికెట్లు కోల్పోతే నాలుగో స్థానంలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌ ఎంతో అవసరం. కార్తీక్‌ నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగలడు. సెమీస్‌కు ముందే అతని అవకాశం ఇవ్వడం మంచిది.’ అని పేర్కొన్నాడు.  


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.