close

తాజా వార్తలు

ఆసీస్‌ అదరహో

స్టార్క్‌ విజృంభణ

 కివీస్‌పై ఘనవిజయం 

 లార్డ్స్‌: సమవుజ్జీల పోరులో ఆస్ట్రేలియానే పైచేయి సాధించింది. ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న కంగారూ జట్టు.. మరో విజయాన్నందుకుంది. శనివారం బౌలర్ల ఆధిపత్యం సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. 86 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 43.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. 40 పరుగులు చేసిన కెప్టెన్‌ విలియమ్సనే ఆ జట్టులో టాప్‌స్కోరర్‌. అతను కాకుండా రాస్‌ టేలర్‌ (30) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. మిచెల్‌ స్టార్క్‌ (5/26) నిప్పులు చెరిగే బంతులతో కివీస్‌ పతనాన్ని శాసించాడు. బెరెన్‌డార్ఫ్‌ (2/31) కూడా చక్కటి ప్రదర్శన చేశాడు. అంతకుముందు బౌల్ట్‌ (4/51), ఫెర్గూసన్‌ (2/49), నీషమ్‌ (2/28)ల ధాటికి ఆసీస్‌ ఒక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఖవాజా (88; 129 బంతుల్లో 5×4), కేరీ (71; 72 బంతుల్లో 11×4)ల అద్భుత పోరాటంతో పుంజుకుని 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బౌల్ట్‌.. వరుస బంతుల్లో ఖవాజా, స్టార్క్‌, బెరెన్‌డార్ఫ్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. బౌల్ట్‌కు వన్డేల్లో ఇది రెండో హ్యాట్రిక్‌. ఈ ప్రపంచకప్‌లో షమి తర్వాత హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌ అతనే. వరుసగా ఐదు విజయాలు సాధించిన కివీస్‌కు.. ఇది వరుసగా రెండో ఓటమి. అయితే 11 పాయింట్లతో ఆ జట్టు సెమీస్‌కు చేరువగానే ఉంది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడిస్తే ఆ జట్టు వేరే సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ చేరుతుంది. ఆ మ్యాచ్‌ ఓడినా.. కివీస్‌ ముందంజ వేయడానికి మెరుగైన అవకాశాలే ఉన్నాయి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.