
తాజా వార్తలు
బర్మింగ్‌హామ్: ఆతిథ్య ఇంగ్లాండ్ X భారత్ మ్యాచ్‌లో టీమిండియా యువక్రికెటర్ రిషభ్ పంత్ ఎట్టకేలకు ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశాడు. జూన్ 9న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో అతని స్థానంలో పంత్ ఎంపికైన విషయం తెలిసిందే. తొలుత మూడు మ్యాచ్‌లకు మాత్రమే ధావన్‌కు విశ్రాంతి ఇస్తున్నామని చెప్పిన టీమిండియా తర్వాత అతను గాయం నుంచి కోలుకోకపోవడంతో పంత్‌కు జట్టులో చోటిచ్చింది. అయితే నేటి మ్యాచ్‌లో విజయ్‌శంకర్‌ను తుది జట్టులో నుంచి తప్పించి పంత్‌కు అవకాశం ఇవ్వడంతో సోషల్ మీడియాలో క్రికెటర్లు, నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. కొందరు పంత్‌ను స్వాగతిస్తుంటే, మరికొందరు దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు.
భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్ దీనిపై స్పందిస్తూ ‘ జట్టులో మార్పు ఉంటుందని ఊహించిందే. కానీ నేను దినేశ్ కార్తీక్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటా. కానీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని నేటి మ్యాచ్‌లో జట్టు పంత్‌కు అవకాశం ఇచ్చింది.’ అని పేర్కొన్నాడు. నెటిజన్లు స్పందిస్తూ ‘విజయ్ శంకర్ స్థానంలో రిషభ్ పంత్‌కు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం. మేము ఈ మ్యాచ్‌ను ఎంతగానో ఆస్వాదిస్తాం.’, ‘శంకర్ స్థానంలో దినేశ్ కార్తీక్‌కు ఎందుకు అవకాశమివ్వలేదు?, అతనిని తుది జట్టులోకి తీసుకోవాల్సింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ‘విజయ్ శంకర్‌కు బొటనవేలు గాయంతో రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు. పంత్ ఎంతో ధైర్యవంతుడు. ఈ మైదానంలో బౌండరీలు చిన్నవి కావడం అతనికి సానుకూలమైన అంశం. అతను క్రీజ్‌లో కుదురుకున్నాక మ్యాచ్ మరోలా ఉంటుంది. పాక్ అభిమానులు ఈ మ్యాచ్‌లో మాకు మద్దతు ఇస్తారని నమ్ముతున్నాను. ఇది అసాధారణమైన విషయం’ అని పేర్కొన్నాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
