
తాజా వార్తలు
బర్మింగ్‌హామ్: తుది జట్టులో స్థానం దక్కకపోయినా ప్రత్యర్థులు చేసే పరుగులకు కళ్లెం వేసే సత్తా ఒక్క జడేజాకు మాత్రమే ఉందంటే అతియోశక్తి కాదు. ఇంగ్లాండ్×భారత్ మ్యాచ్‌లో రాహుల్ గాయంతో మైదానంలో సబ్‌స్టిట్యూట్‌గా అడుగుపెట్టిన సర్ జడేజా మరోసారి తన మార్క్‌ను చూపించాడు. ఎంత ప్రయత్నించిన వికెట్ పడని భారత్ బౌలర్ల శ్రమకు జడేజా ఫీల్డింగ్ ఫలితాన్ని తెచ్చిపెట్టింది. కుల్దీప్ యాదవ్ వేసిన 23వ ఓవర్లో రాయ్ లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. జడేజా ముందుకు దూకుతూ బంతిని అందుకోవడంతో 160 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో జడేజాపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
‘జట్టు నుంచి నువ్వు దూరమైన మ్యాచ్ నుంచి నిన్ను ఎవరూ దూరం చేయలేరు’, ‘ ఈ మ్యాచ్‌లో జడేజా 20-25 పరుగులను కట్టడి చేశాడు. చాహల్, కుల్దీప్ కంటే జడేజానే ఉత్తమం.’, ‘జడేజా క్యాచ్ చూసిన తర్వాత అందరూ అతన్ని జట్టులో ఎందుకు తీసుకోలేదని తప్పకుండా ప్రశ్నిస్తారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (111), రాయ్ (66), స్టోక్స్ (99) రాణించారు. భారత్ బౌలర్లలో షమి ఐదు వికెట్లు, బుమ్రా, కుల్దీప్ చెరో వికెట్ పడగొట్టారు.
Ravindra Jadeja catch 😼😎#INDvENG pic.twitter.com/ipxV8YvRnD
— Awaarapan 🇮🇳 (@KingmakerOne1) June 30, 2019
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- తీర్పు చెప్పిన తూటా
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
