close

తాజా వార్తలు

నేటి మ్యాచ్‌లో ఈ రికార్డులు నమోదవుతాయా?

బర్మింగ్‌హామ్‌: భారత్‌×బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే బంగ్లాదేశ్‌ తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌ ఇది. అయితే ఈ మ్యాచ్‌ బంగ్లా, భారత్‌ ఆటగాళ్లకు ఎంతో ప్రత్యేకం కానుంది. ఈ పోరులో ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లు పడగొడితే 100 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. అంతేగాక భారత్‌ తరఫున తక్కువ వన్డేల్లో ఈ ఘనత సాధించిన షమి (56) సరసన నిలుస్తాడు. ప్రపంచంలో తక్కువ వన్డేల్లో ఈ రికార్డు సాధించిన ఆరో బౌలర్‌గానూ బుమ్రా రికార్డు సృష్టిస్తాడు.

ఇవి కూడా నమోదవుతాయా?
* విరాట్‌ కోహ్లీ 31 పరుగులు సాధిస్తే ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున 1000 పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాకుండా ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ వెయ్యి పరుగులు సాధించడానికి మరో ఏడు రన్స్‌ అవసరం. రోహిత్‌ శర్మ నాలుగు పరుగుల దూరంలో ఉండటం విశేషం. 

* ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఒక వికెట్‌ తీస్తే తన కెరీర్‌లో 50 వికెట్లను పూర్తిచేసుకుంటాడు. 82 పరుగులు సాధిస్తే అతను వన్డేల్లో వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.     

* మహ్మదుల్లా 53 పరుగులను సాధిస్తే వన్డేల్లో 4వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ తరఫున 4వేల పరుగులు సాధించిన ఆటగాళ్లు ముగ్గురు మాత్రమే. తమిమ్‌ ఇక్బాల్‌ (6841), షకిబ్‌ అల్‌ హసన్‌ (6193), ముష్ఫికర్‌ రహీమ్‌ (5885) సాధించారు.

* ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్‌ రహీమ్ రెండు సిక్సర్లను బాదితే ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. మహ్మదుల్లా 11 సిక్సర్లు బాదగా ముష్ఫికర్‌ 10 సిక్సర్లు కొట్టాడు.

* తమీమ్‌ ఇక్బాల్‌కు ఇది 200 వన్డే. బంగ్లాదేశ్‌ తరఫున మష్రఫె మొర్తజా, ముష్ఫికర్‌ రహీమ్‌, షకిబ్‌ అల్‌ హసన్‌ మాత్రమే 200 వన్డేలు ఆడారు. 
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.