close

తాజా వార్తలు

అఫ్గాన్‌లో ఉగ్రదాడి.. 12 మంది మృతి

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్‌ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పేలుడు పదార్థాలు నింపిన ఓ కారులో వచ్చిన ఉగ్రవాదులు.. జన సమూహం అధికంగా ఉన్న గజనీ ప్రాంతంలో దాన్ని పేల్చేశారు. దీంతో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో ఉన్న నిఘా అధికారులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎనిమిది మంది నేషనల్ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ (ఎన్‌డీఎస్‌)కు చెందిన వారు, నలుగురు పౌరులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ దాడికి తామే బాధ్యతవహిస్తున్నట్లు తాలిబన్లు ప్రకటన చేశారు.

నిఘా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో ఈ దాడులు జరిగాయని, అక్కడ ఉన్న దాదాపు 50 మంది సామాన్య ప్రజలకు తీవ్రగాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆ ప్రాంతంలో ప్రజలు అధికమంది ఉన్న సమయంలో ఈ దాడి చోటు చేసుకుందని వివరించారు. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ ప్రతినిధి అరీఫ్‌ నూరీ నిర్ధారించారు. ఈ ఘటనలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాలిబన్ ప్రతినిధులు, అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య ఖతార్‌ రాజధాని దోహాలో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు తాలిబన్లు ఉగ్రదాడులను కొనసాగిస్తూనే ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.